Asia Cup 2025: ఇన్విసబుల్ బాయ్ కాట్...ఈరోజు మ్యాచ్ లో బీసీసీఐ దీనిని ఎందుకు అమలు చేస్తోంది?

పాకిస్తాన్ తో ఎటువంటి మ్యాచ్ లు ఆడకూడదని చాలా డిమాండ్లు వచ్చాయి. పహల్గాం దాడి తర్వాత ఆ దేశాన్ని బ్యాన్ చేయాలని అందరూ చెప్పారు. కానీ బీసీసీఐ మాత్రం మ్యాచ్ ఆడాలనే నిర్ణయించింది. ఎందుకు అందరి మాటా పక్కన పెట్టి మరీ ఈ డెసిషన్ తీసుకుంది. కింది ఆర్టికల్ లో..

New Update
asia cup 2025

ఈ ఏడాది ఏప్రిల్ లో ఉగ్రవాదులు కాశ్మీర్ లోని పహల్గాంలో దాడి చేశారు. వీరికి పాకిస్తాన్ దన్నుగా నిలిచింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే భారతం కూడా సహల్గాం దాడి తరువాత పాక్ పై దండెత్తి... అక్కడ ఉన్న ఉగ్ర స్థావరాలన్నింటినీ పేల్చేసింది. మూడు రోజుల పాటూ ఇరు దేశాల మధ్యనా యుద్ధం జరిగింది. తరువాత ఒక ఒప్పందానికి వచ్చి వార్ ను ఆపేశారు. దీని తరువాత పాకిస్తాన్ తో ఎటువంటి సంబంధాలను పెట్టుకోకూడదని కేంద్రం నిర్ణయించింది. అది క్రికెట్ కూ వర్తిస్తుందని చెప్పింది. పాకిస్తాన్ తో టీమ్ ఇండియా మ్యాచ్ లు ఆడకూడదంటూ కండిషన్లు పెట్టింది.

మ్యాచ్ ఆడటంపై వ్యతిరేకత..

పహల్గాం దాడి తరువాత ఇప్పుడు ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ తో తలపడేందుకు సిద్ధమైంది. బీసీసీఐ ఇందుకు పర్మిషన్ ఇచ్చింది. దాని కంటే ముందు ఈ విషయమై చాలా పెద్ద గొడవనే జరిగింది. 26 మంది ప్రాణాల కంటే క్రికెట్ ఎక్కువైందా అని విమర్శలూ వచ్చాయి. మనతో క్రికెట్ ఆడటం వల్ల పాక్‌కు భారీగా ఆదాయం సమకూరుతుందని.. దానిని భారత్‌పై యుద్ధం చేసేందుకే వినియోగిస్తున్నారని కూడా కొందరన్నారు. స్వయంగా పహల్గాం బాధితురాలు కూడా భారత్ క్రికెట్ ఆడకూడదని చెప్పారు. అలాగే మాజీ క్రికెటర్లు సైతం పాక్ తో మ్యాచ్ బాయ్ కాట్ చేయాలని చెప్పారు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్ క్రికెట్ టోర్నీలోనూ మన మాజీలు పాక్‌తో ఆడేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఈ ఆసియా కప్ లో కూడా అదే చేయొచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు. పైగా ఈరోజు జరిగే భారత్, పాక్ మ్యాచ్ పై ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఎప్పుడూ లేనిది ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు టికెట్లు సేల్ అవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. అయినా కూడా బీసీసీఐ ఇవన్నీ పట్టించుకోకుండా టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడిస్తోంది. క్రికెట్ర్లు కూడా తమకేమీ సంబంధం లేదు.. బీసీసీఐ ఎం చెప్తే అదే చేస్తామని చెప్పారు.

ఇన్విసబుల్ బాయ్ కాట్..దీని అర్ధం ఏంటి?

పహల్గాందాడికంటే ముందే టీమ్ ఇండియా పాకిస్తాన్ తో చాలా మ్యాచ్ లు ఆడటం లేదు. వారి దేశంలో ఆడే విషయం అయితే పూర్తిగా మర్చిపోయారు కూడా. కేవలం ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు మాత్రమే పాకిస్తాన్ తో ఆడుతోంది భారత జట్టు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సీరీస్ లను పూర్తిగా మానేశారు. అయితే ఐసీసీ, ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో మాత్రం ఎందుకు ఆడడం అనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. దీనికి బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. తాము కేవలం డబ్బులు గురించి మాత్రమే ఆలోచించడం లేదు. భారత జట్టు టైటిల్ పై కూడా ప్రభావం ఉందని భావిస్తున్నామని తెలిపింది. ఐసీసీ, ఆసినయా కప్ లాంటి టోర్నీల్లో ప్రతీ మ్యాచ్ కీలకమైనదే. అది టైటిల్ విన్నింగ్ పై పరభావం చూపిస్తుంది. లీగ్ స్టేజ్ లో పాక్ తో ఆడడం మానేస్తాం. కానీ సమీస్ లేదా ఫైనల్ లో ఆ టీమ్ తో మ్యాచ్ పడితే ఏం చేయాలి. అప్పుడు కూడా మానేస్తే..మనచేతులతోనే వారికి కప్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని బీసీసీఐ ప్రశ్నిస్తోంది. అలా జరిగితే మళ్ళీ మాట పడేది కూడా టీమ్ ఇండియానే. ఎన్ని మ్యాచ్ లు గెలిచినా...భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోతే చాలు..నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అలాంటిది కప్ వదిలేయాల్సిన పరిస్థితి వస్తే..క్రికెట్‌పై అవాకులు చెవాకులు పేలేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. పాకిస్తాన్ తో ఆడలేకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటారు. ఆ దేశం కూడా ఇదే స్టేట్ మెంట్లను పాస్ చేస్తుంది. దాంతో పాటూ ఆసియా కప్ లో పాక్ పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే అభిమానులూ ఉన్నారు. అందుకే టీమ్ ఇండియాతో ఈ మ్యాచ్ లను ఆడిస్తున్నామని బీసీసీఐ చెప్పింది. అయితే దీనికి తామెవ్వరం రావడం లేదని...బీసీసీఐ నుంచి ఒక్కరు కూడా హాజరు కావడం లేదని చెబుతున్నారు. కేవలం ఐసీసీ, ఏసీసీ నిబంధనలు మేరకే టీమ్ ఇండియా ఈ మ్యాచ్ ఆడుతోందనే సందేశం బలంగా ఇవ్వాలనే ఇలా చేస్తున్నామని తెలిపింది.

Advertisment
తాజా కథనాలు