/rtv/media/media_files/2025/07/07/kohli-brother-son-2025-07-07-18-54-59.jpg)
ఐపీఎల్ లాగే త్వరలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 కానుంది. క్రికెట్‌లో తర్వాతి తరం అరంగేట్రానికి ఇది వేదిక కానుంది. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్న కుమారుడు డీపీఎల్ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సెహ్వాగ్ కుమారుడిని రూ. 8 లక్షలకు దక్కించుకోగా, కోహ్లీ అన్న కొడుకును రూ.లక్షకు తీసుకున్నారు. ఇక్కడ ఆస్తికర విషయం ఏంటంటే ఇద్దరి పేరు ఆర్యవీర్ కావడం విశేషం. విరాట్ కోహ్లీ అన్న వికాస్ కుమారుడు ఆర్యవీర్ కోహ్లీ లెగ్ స్పిన్నర్. డీపీఎల్ వేలంలో అతన్ని సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టు రూ.లక్షకు దక్కించుకుంది. ఆర్యవీర్ కోహ్లీ కూడా తన బాబయ్ ట్రైనింగ్ తీసుకున్న రాజ్‌కుమార్ శర్మ వద్దే ప్రస్తుతం ట్రైన్ అవుతున్నాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు, 18 ఏళ్ల ఆర్యవీర్ కూడా తండ్రిలాగే ఓపెనర్.
ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
ఇది కూడా చూడండి: AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
రూ.8 లక్షలకు సెహ్వాగ్ కుమారుడు
డీపీఎల్ ఆక్షన్‌లో అతడు వేలానికి రాగా పలు ఫ్రాంఛైజీలు అతన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి. చివరకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు రూ.8 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ డీపీఎల్ 2025 వేలంలో పేసర్ సిమర్‌జీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడని ఢిల్లీ కింగ్స్ రూ.39లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. తరువాతి లిస్టులో సిమర్జీత్ సింగ్ (రూ. 39 లక్షలు, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్), నితీష్ రాణా (రూ. 34 లక్షలు, వెస్ట్ ఢిల్లీ లయన్స్), ప్రిన్స్ యాదవ్ (రూ. 33 లక్షలు, న్యూ ఢిల్లీ టైగర్స్) ఉన్నారు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, న్యూఢిల్లీ టైగర్స్ (కొత్త జట్టు), నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, ఔటర్ ఢిల్లీ వారియర్స్ (కొత్త జట్టు), ఓల్డ్ ఢిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ వంటి జట్లు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్నాయి. టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతాయి. టోర్నమెంట్ షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు.
ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
Also Read : అమ్మో.. రామయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?
Delhi Premier League 2025 | virender-sehwag | sports | cricket | Virat Kohli