IND vs Pak : కోహ్లీని భయపెడుతున్న పాక్ స్పిన్నర్... ఇంతకీ ఎవరితను?

కోహ్లీ గత 5 ఇన్నింగ్స్‌లలో లెగ్ స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు. పాకిస్తాన్ జట్టులో అబ్రార్ అహ్మద్ రూపంలో ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్ తో జరగబోయే మ్యాచ్ లో ఇతడి బౌలింగ్ లో కోహ్లీ ఎలా ఆడుతాడన్నది చూడాలి.   

New Update
kohli vs pak

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా బోణీ కొట్టింది.  రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించి మంచి జోష్ లో ఉంది.  రేపు అంటే  ఫిబ్రవరి 23 (ఆదివారం) తన రెండవ మ్యాచ్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

Also Read :  భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌.. ఆ జట్టు ఓడిపోతుంది: కుంభమేళాలో బాబా సంచలన వ్యాఖ్యలు (వీడియో)!

పాకిస్థాన్‌తో జరిగే ఈ బిగ్ మ్యాచ్‌లో, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ నుండి అద్భుతమైన ప్రదర్శనను టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 22 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ వేసిన బంతిని కట్ షాట్ కొట్టడానికి కోహ్లీ ప్రయత్నించగా.. సౌమ్య సర్కార్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Also Read :  సచిన్, గంగూలీ అందరూ వెనక్కు..రోహిట్ @ 11000

2024 నుండి వన్డేల్లో లెగ్ స్పిన్నర్లతో విరాట్ కోహ్లీ చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. కోహ్లీ గత 5 ఇన్నింగ్స్‌లను ఒకసారి పరిశీలిస్తే లెగ్ స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు. ఇందులో ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ..  కోహ్లీని రెండుసార్లు అవుట్ చేశాడు. ఇప్పుడు పాకిస్థాన్‌తో జరగబోయే  మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ స్పిన్ బౌలర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు క్రికెట్ నిపుణులు. పాకిస్తాన్ జట్టులో అబ్రార్ అహ్మద్ రూపంలో ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు. 26 ఏళ్ల అబ్రార్ పాకిస్తాన్ తరఫున 10 టెస్టుల్లో 46 వికెట్లు, 8 వన్డేల్లో 14 వికెట్లు, 7 టీ20ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఇతడి బౌలింగ్ లో కోహ్లీ ఎలా ఆడుతాడు అన్నది చూడాలి.   

Also Read :  ఒక్కొక్కరు ఒక్కోలా..టీమ్ ఇండియా ఆటపై సీనియర్లు

2024 నుండి లెగ్ స్పిన్నర్లపై విరాట్ కోహ్లీ  ప్రదర్శన

ఇన్నింగ్స్: 5
బంతులు: 51 
పరుగులు: 31 
అవుట్లు: 5 సార్లు 
సగటు: 6.20
స్ట్రైక్-రేట్: 60.78

అయితే పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డు గట్టిగానే ఉంది. 16 వన్డేల్లో కోహ్లీ 52.15 సగటుతో 678 పరుగులు చేశాడు. ఇందులో3 సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.  2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ చేసిన 183 పరుగులు వన్డేల్లో అతని అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. 

Also read :   అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా...తేలిపోయిన ఆఫ్ఘాన్

Advertisment
తాజా కథనాలు