Champions Trophy: అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా...తేలిపోయిన ఆఫ్ఘాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మూడవ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య జరిగింది. ఇందులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో ఆఫ్ఘాన్ చిత్తుగా ఓడిపోయింది. 

New Update
cric

South Africa Won The Match

నిన్న పాకిస్తాన్ లో జరిగిన సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్రికన్లు మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. నిర్ణీత ఓవర్లలో సఫారీలు ఆరు వికెట్లు కోల్పోయి 315 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఫ్ఘాన్ కి ఇచ్చింది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో ర్యాన్ రికెల్టన్ 106 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 103 పరుగులతో శతకం బాదాడు. జట్టులో మిగతావారిలో కెప్టెన్ బవుమా 58, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 52, మార్క్రమ్ 52 పరుగులతో అర్ధ సెంచరీలు చేశారు. దీంతో సఫారీ జట్టు ఆఫ్ఘాన్ టీమ్ కు భారీ లక్ష్యాన్నే ఇచ్చింది. 

Also Read: Mumbai: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన

మా వల్లకాదని చేతులెత్తేసింది..

రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘానిస్తాన్ టీమ్ 43.3 ఓవర్లలో 208 పరుగులు మాత్రమే చేసి ఆలైట్ అయింది. ఈ జట్టులో రెహమత్ షా ఒక్కడే 90 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ప్లేయర్లు అందరూ చేతులెత్తేశారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (17), సెడిఖుల్లా అటల్ (16), హష్మతుల్లా షాహిదీ డకౌట్, అజ్మతుల్లా ఒమర్జాయ్ (18), మహమ్మద్ నబీ (8), గుల్బాదిన్ నాయబ్ (13), రషీద్ ఖాన్ (18), నూర్ అహ్మద్ (9) పరుగులు చేశారు. ఇక సఫారీ టీమ్ లో రబాడ 3 వికెట్లు తీసుకున్నాడు. ఎంగిడీ, మల్డర్ తలో రెండు వికెట్లు తీసుకోగా..మార్కో జన్‌సన్, కేశవ్ మహారాజ్‌కు చెరో వికెట్ దక్కింది.  

Also Read: TS: చనిపోయారు,ఎలా విచారించాలి..రాజలింగమూర్తి పిటిషన్ పై హైకోర్టు

Advertisment
తాజా కథనాలు