ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజేత టీమ్ ఇండియానే అంటున్నారు మాజీ కెప్టెన్, దాదా గంగూలీ. ముఖ్యంగా ఆదివారం జరిగే భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ అయితే కచ్చితంగా టీమ్ ఇండియానే గెలుస్తుందని చెప్పారు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు. ఐసీసీ టోర్నమెంటుల్లో ఇండియాకు అద్భుతమైన రికార్డ్ ఉంది. దానిని ఇప్పటి టీమ్ కూడా కొనసాగిస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. పరిమిత ఓవర్లలో భారత్ చాలా బలమైన జట్టని ఆయన అన్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా వంటి ప్రముఖ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
టీమ్ ఇండియా ఇంకా ముందే ముగించాల్సింది..
మరోవైపు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా టీమ్ ఇండియా గురించి మాట్లాడారు. మొన్న జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ పై భారతజట్టు ఇంకొంచెం ముందుగా మ్యాచ్ ముగిస్తుందని భావించానని తెలిపారు. అయితే వికెట్లు పోయిన టీమ్ ఇండియా ఏ మాత్రం తడబడలేని...అలా అవడానికి అవతల ఉన్నది పాకిస్తాన్, ఆస్ట్రేలియా కాదు కదా అంటూ మాట్లాడారు. బంగ్లాదేశ్ జట్టు ఏమాత్రం గొప్ప జట్టు కాదు. తాను ఎప్పుడూ ఆ జట్టును చూసి భయపడలేదని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. నిజానికి ఇది చాలా తేలికగా విజయం సాధించాల్సిన మ్యాచ్. నాలుగు ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా.. భారత్ గెలిచింది. రోహిత్, విరాట్, శ్రేయస్‌లో ఒకరు క్రీజ్‌లో ఉండుంటే భారత్ 35 ఓవర్లలోనే మ్యాచ్ ముగించేది అని సెహ్వాగ్ కామెంట్ చేశారు.
ఇక భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. గత కొంతకాలగా స్పిన్ బౌలింగ్ లో ఇబ్బందిపడుతున్న విరాట్ కు పలు కీలక సూచనలు చేశాడు. స్లో బంతులు, లెగ్గీలను అసౌకర్యంగా భావిస్తున్నాడని చెప్పాడు. లెగ్‌సైడ్ వచ్చే బంతులను ఆడేందుకు ప్లాన్ లేకపోవడంతో విఫలమవుతున్నాడన్నారు. స్ట్రైక్‌ను రొటేట్ చేయకపోవడంవల్లే మరింత ఒత్తిడికి గురువుతున్నాడన్నారు.
ఇది కూడా చదవండి: Crime: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి!
Cricket: ఒక్కొక్కరు ఒక్కోలా..టీమ్ ఇండియా ఆటపై సీనియర్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ మీద భారత్ గెలిచింది. ఈమ్యాచ్ లో టీమ్ ఇండియా ఆడిన తీరుపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. దాంతో పాటూ ఆదివారం జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో గెలుపు మనదే అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Ganguly, Sehwag, Harbhajan