/rtv/media/media_files/2025/02/09/9clDPRSVxgvKoacssO6o.jpg)
Rohith Sharma Century
మాస్టర్ బ్లాసర్ సచిన్, దాదా గంగూలీ ఇప్పుడు వీళ్ళందరూ వెనక్కు వెళిపోతున్నారు. వారి రికార్డులు ఎప్పటికీ చెరిగిపోవు కానీ వాటికి మించిన రికార్డులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్ లు పరుగుల వరద పారిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. వన్డేల్లో అత్యంత తొందరగా 11 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఈ ఫీట్ ను సాధించాడు. కింగ్ కోహ్లీ తరువాత వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగుల మార్క్ చేరుకున్న ఆటగాడిగా కెప్టెన్ రికార్డులకెక్కాడు.
Also Read : నెల్లూరులో స్కూల్ బస్సు బోల్తా!
11 వేల పరుగులు చేసిన బ్యాటర్లు..
11 వేల పరుగులు చేసిన బ్యాటర్లలో రన్ మెషీన్ విరాట్ 222 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించగా..రోహిత్ 261 మ్యాచ్ లలో ఈ మైలు రాయిని చేరుకున్నాడు. వీరి తర్వాత సచిన్ 276 మ్యాచ్ లలో...తరువాత రికీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్లలో, గంగూలీ 288 మ్యాచ్ లలో ఈ లిస్ట్ లో ఉన్నారు. అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన భారత ఆటగాళ్లలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 338 సిక్సులు ఉండగా.. అగ్రస్థానంలో షాహిద్ అఫ్రిది 351 సిక్సులతో కొనసాగుతున్నాడు.
Also Read : ఎఫ్‌బీఐ డెరెక్టర్‌గా ట్రంప్ విధేయుడు..ఇంతకీ ఈ భారతీయుడు ఎవరో తెలుసా!
మరోవైపు నిన్న మ్యాచ్ లో భారత బౌలర్ షమి కూడా ఒక ఫీట్ ను సాధించాడు. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ, వేగంగా 200 వన్డే వికెట్లు పూర్తి చేసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇతను కేవలం 104 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. షమికన్నా ముందు భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ 133 మ్యాచ్ 200 వికెట్లు తీశాడు. షమి ఇప్పడు ఆ రికార్డ్ ను అధిగమించాడు.
Also Read : జగన్ కు ఊహించని షాక్.. ఆ నేతలంతా జనసేనలోకి!
11,000 ODI RUNS - the legend of Rohit Sharma 🙌 pic.twitter.com/3JF3KYDjA2
— ESPNcricinfo (@ESPNcricinfo) February 20, 2025
Also Read: High Court: ఇలా అయితే హైడ్రాను మూసేయాల్సొస్తుంది..హైకోర్టు