/rtv/media/media_files/2025/03/22/wvPUeQq1dSx0Zlb58b7u.jpg)
Virat Kohli likely to create two more records in IPL
Virat Kohli: విరాట్ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇంకో 24 పరుగులు చేస్తే టీ20ల్లో ఆర్సీబీ తరఫున 9వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. అలాగే మరో హాఫ్ సెంచరీ చేస్తే డేవిడ్ వార్నర్ (62) రికార్డు బద్దలు కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాటర్‌గా నిలవనున్నాడు.
ఇప్పటికే ఈ సీజన్‌లో ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో 548 పరుగులు చేసిన కోహ్లీ ఆర్సీబీలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే మరో 24 పరుగులు చేస్తే టీ20ల్లో ఆర్సీబీ తరఫున 9వేల రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్‌లో 8,552 పరుగులు చేసిన కోహ్లీ, సీఎల్‌టీ20 (ఛాంపియన్ లీగ్ టీ20)లో 14 ఇన్నింగ్స్‌లో 424 రన్స్ చేశాడు. మొత్తంగా ఆర్సీబీ తరఫున 270 ఇన్నింగ్స్‌ల్లో 8,976 రన్స్ కొట్టాడు.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
ఇక మరో హాఫ్ సెంచరీ చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. 62 అర్ధశతకాలతో డేవిడ్ వార్నర్‌తో పేరిటవున్న రికార్డును బద్దలు కొడతాడు. అయితే ఈ సీజన్ లోనే ఈ రెండు రికార్డులు బద్ధలు కొడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక 2025 సీజన్‌లో ఆర్సీబీ 17 పాయింట్లో 3వ స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరగనుండగా నెట్‌రన్ రేట్‌తో విజయం సాధిస్తే ఆర్సీబీ మొదటి ప్లేస్ లో నిలుస్తుంది.
virat-kohli | ipl | rcb | today telugu news