West Indies Vs Australia: ఉతికారేశాడు భయ్యా.. టిమ్ డేవిడ్ రికార్డు సెంచరీ.. సిరీస్ కైవసం

వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌‌ను ఆసీస్ దక్కించుకుంది. మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 37 బంతుల్లో 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆస్ట్రేలియా తరఫున వేగవంతమైన T20I సెంచరీని నమోదు చేశాడు.

New Update
fastest century in t20

fastest century in t20

west indies vs australia: వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ (aus vs wi t20) అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌ ఇవాళ జరగగా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ (tim david) అద్భుతమైన ప్రదర్శనతో దుమ్ము దులిపేశాడు. సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డేవిడ్ సెంచరీతో విజృంభించాడు. 

fastest century in t20

కేవలం 37 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగవంతమైన T20I సెంచరీ (fastest century in t20) సాధించిన ప్లేయర్‌గా టిమ్ డేవిడ్ నిలిచాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 11 భారీ సిక్స్‌లు ఉన్నాయి. 

Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 215 పరుగులు నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో టిమ్ డేవిడ్ కీలక పాత్ర పోషించాడు. ఫోర్లు సిక్సర్లతో డేవిడ్ వీరోచిత బ్యాటింగ్‌ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో 16.1 ఓవర్లలోనే వెస్టిండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా T20I సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. 

Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు టిమ్ డేవిడ్ తన అర్ధ సెంచరీని కేవలం 16 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. దీంతో T20Iలలో ఆస్ట్రేలియా తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో జోష్ ఇంగ్లిస్ 43 బంతుల్లో సాధించిన సెంచరీ రికార్డును కూడా డేవిడ్ బద్దలు కొట్టాడు. టిమ్ డేవిడ్ బ్యాటింగ్ మెరుపులతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అతని అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. 

Also Read:ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు