Cricket: మొదటి టీ20 మనదే...అదరగొట్టిన అభిషేక్

మొత్తానికి అనుకున్నట్టుగానే కుర్రాళ్ళు అదరగొట్టారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టీ20లో విజయం సాధించింది టీమ్ ఇండియా. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ని ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సీరీస్ లో టీమ్ ఇండియా 1-0తో ముందంజలో ఉంది.

New Update
cricket

Abhishek Varma

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 ఐదు మ్యాచ్ ల సీరీస్ లో భారత జట్టుకు మంచి ఆరంభం వచ్చింది.  ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్  20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లలోనే ఛేదించింది.

మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ...

ఓపెనర్ అభిషేక్ శర్మ  34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు కొట్టి 79 పరుగులు చేశాడు.  ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇతని తర్వాత సంజూ శాంసన్ 20 బంతుల్లో 26 పరుగులు, తిలక్ వర్మ 16 బంతుల్లో 19 పరుగులు చేశారు. ీ మ్యాచ్ గెలిచి టీమ్ ఇండియా మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 చెన్నైలో జనవరి 25న జరగనుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) పరుగులు చేశారు.

ఇక ఈ మ్యాచ్‌లో యువ పేస‌ర్ అర్ష్‌దీప్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. బెన్ డకెట్‌ను ఔట్ ‍చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకెక్కాడు. అర్ష్‌దీప్ ఇప్పటి వరకు 61 టీ20 మ్యాచ్‌లు ఆడగ్గా 97 వికెట్లు తీశాడు. అయితే ఈ రికార్డు ఇంత‌కు ముందు భార‌త స్పిన్నర్ యుజ్వేంద్ర చాహ‌ల్ మీద ఉంది. చాహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజా మ్యాచ్‌తో అర్షదీప్ సింగ్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ రోజు మ్యాచ్ లో భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read: ఐటీ రైడ్స్‌పై స్పందించిన దిల్‌రాజు.. ఏమన్నారంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు