/rtv/media/media_files/2025/01/07/WEd4gwFbDFKOOnzR0wmU.jpg)
dil raju comments Photograph: (dil raju comments )
Dil Raju on IT Raids: తెలంగాణలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు, డెరెక్టర్లపై ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రైడ్స్ చేస్తున్నా విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. బుధవారం సాయంత్రం దిల్‌రాజు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఐటీ సోదాలు తన ఒక్కడి మీదనే జరగడం లేదని తెలుగు సినీ ఇండస్ట్రీలో మొత్తం రైడ్స్ జరుగుతున్నాయని మీడియాతో అన్నారు. సినీ ప్రముఖుల, ఇళ్లు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
Also Read : పొలిటికల్ యాంగ్రీ లీడర్స్.. బూతులు, దాడుల్లో వీళ్లే నెం.1
డైరెక్టర్ సుకుమార్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో కూడా ఐటీ రైడ్స్..
మైత్రీ మూవీ మేకర్స్, పుష్పా మూవీ డైరెక్టర్ సుకుమార్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో కూడా ఇన్‌కం ట్యాక్స్ అధికారుల రైడ్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్లు ట్యాక్స్ చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్లు అధికారుల గుర్తించారు. పలు సంస్థల లావాదేవీలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 55 టీంలు సినీ సెలబ్రెటీల బ్యాంక్ లాకర్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలు, భారీ కలెక్షన్లు వస్తున్నాయని వచ్చిన వార్తల తర్వాత ఈ రైడ్స్ జరగడం ప్రధాన్యత సంతరించుకుంది.
Also Read : సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
Also Read: జన్మతః పౌరసత్వం రద్దు.. కోర్టుల్లో సవాలు చేసిన 22 రాష్ట్రాలు
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!