PAK vs WI : పరువు తీసుకున్న పాక్..  34 ఏళ్ల తరువాత సొంతగడ్డపై

పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్‌  ఫీల్డింగ్ ఎంచుకుంది.

New Update
pak vs wi

పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్‌  ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండిస్ జట్టు 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కేవలం 94 బంతుల్లో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

ఏడో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం

184 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి  పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు, హోప్, జస్టిన్ గ్రీవ్స్ (43 నాటౌట్) తో కలిసి ఏడో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును అదుకున్నారు.  పాక్  బౌలర్లలో అబ్రార్ అహ్మద్, నసీమ్ షా చెరో రెండు వికెట్లు తీశారు. 295 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌ కాగా సల్మాన్ అగా చేసిన 30 పరుగులే పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 

Also Read :  Pulivendula ZPTC : పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్‌ .. ఆ రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జైడెన్ సీల్స్ పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అతను కేవలం 18 పరుగులిచ్చి కెరీర్ బెస్ట్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ విజయంతో వెస్టి్ండిస్ సరికొత్త రికార్డు సృష్టించింది. 1991 తర్వాత పాకిస్తాన్‌పై సాధించిన మొదటి ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విశేషం. అంటే  34 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌పై వెస్టి్ండిస్  వన్డే సిరీస్‌ను గెలుచుకుందన్నమాట.  సొంతగడ్డపై వెస్టిండిస్ లాంటి జట్టుపై ఓటమి పాలు కావడం పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బెనని చెప్పాలి. ఈ సిరీస్‌లో సీల్స్ 10 వికెట్లు సాధించిన  జైడెన్ సీల్స్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇక హోప్ సెంచరీ అతన్ని వెస్టిండీస్ తరపున వన్డే సెంచరీలలో దిగ్గజాలు బ్రియాన్ లారా, క్రిస్ గేల్‌లకు దగ్గరగా చేసింది.

Also Read :   Snake In Curry Puff : ఇదెందయ్యా..ఇది  కర్రీ పఫ్‌ లో పాము పిల్ల.. షాక్ తో ఆ మహిళ ఏం చేసిందంటే..

Advertisment
తాజా కథనాలు