Shubman Gill: ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా శుభ్‌మన్‌.. ఒక్క టెస్టుకే రికార్డులు కొల్లగొడుతున్న కెప్టెన్ గిల్

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌ అయిన శుభమన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన చేసి ఐసీసీ జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యాడు. అయితే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు శుభ్‌మన్ తీసుకోవడం ఇది నాలుగోసారి.

New Update
Shubman Gill

Shubman Gill

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌ అయిన శుభమన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన చేసి ఐసీసీ జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యాడు. ఈ రేసులో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికా ప్లేయర్ వియాన్ ముల్డర్ ఉన్నా కూడా శుభ్‌మన్ గిల్‌కి అవార్డు లభించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గిల్ నాలుగు సెంచరీలు సహా 754 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు. అయితే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు శుభ్‌మన్ తీసుకోవడం ఇది నాలుగోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి, రెండేళ్ల కిందట జనవరి, సెప్టెంబర్‌లో అవార్డు అందుకున్నారు. అయితే పురుషుల విభాగంలో ఈ అవార్డు సాధించిన మొదటి ఆటగాడు కూడా గిల్.

ఇది కూడా చూడండి: PAK vs WI : పరువు తీసుకున్న పాక్..  34 ఏళ్ల తరువాత సొంతగడ్డపై

ఎంతో ఆనందంగా ఉందని..

జులై నెల ఐసీసీ ప్లేయర్‌గా ఎంపికైన తర్వాత గిల్ స్పందించాడు. ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన రెండు సెంచరీలు ఎప్పటికీ గుర్తు ఉంటాయన్నాడు. బర్మింగ్‌హోమ్‌లో జరిగిన టెస్టులో చేసిన డబుల్ సెంచరీ తనకి ఎప్పటికీ గుర్తు ఉంటుందని తెలిపాడు. కెప్టెన్‌గా ఈ సిరీస్ ఎంతో నేర్పించిందని తనకు నేర్పించిందని అన్నాడు. ఇదే ఫామ్‌ను వచ్చే సిరీస్‌లో కూడా కొనసాగిస్తానని అనుకుంటున్నాని తెలిపాడు. 

ఇది కూడా చూడండి:Yash Dayal : యష్ దయాల్ పై రేప్ ఆరోపణలు .. UPCA సంచలన నిర్ణయం

ఇదిలా ఉండగా ఐసీసీ జులై మహిళల ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ సోఫియా డంక్లీ ఎంపికైంది. భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో 7 మ్యాచ్‌ల్‌లో డంక్లీ 270 పరుగులు సాధించింది. మహిళల్లో అత్యధికంగా హేలీ మాథ్యూస్‌ (వెస్టిండీస్‌), ఆష్లీ గార్డ్‌నర్‌ 76 (ఆస్ట్రేలియా) నాలుగు చొప్పున అవార్డులు అందుకున్నారు.

Advertisment
తాజా కథనాలు