Yash Dayal : యష్ దయాల్ పై రేప్ ఆరోపణలు .. UPCA సంచలన నిర్ణయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ యష్ దయాల్ రేప్ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతనిపై ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది.

New Update
yash dayal

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ యష్ దయాల్ రేప్ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతనిపై ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది. 2025 ఆగస్టు  17వ తేదీ నుంచి జరగబోయే యూపీ 20 లీగ్ లో అతడు అడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. ఈ సంవత్సరం వేలంలో రూ. 7 లక్షలకు కొనుగోలు చేసింది గోరఖ్‌పూర్ లయన్స్‌.  అయితే నిషేధంపై తమకు ఎలాంటి సమాచారం లేదని యజమాని విశేష్ గౌర్ వెల్లడించారు.  

Also Read : ఇంత దారుణమా?.. షాకింగ్ వీడియో బయటపెట్టిన కవిత!

2022 జూలైలో ఒక యువతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడని యష్ దయాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత ఒక మైనర్ బాలిక కూడా అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యష్ దయాల్ అరెస్టుపై అలహాబాద్ హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. దీంతో ఈ కేసుపై విచారణ ముగిసే వరకు లేదా పోలీసు నివేదిక సమర్పించే వరకు అతడిని అరెస్టు చేయరు. ఈ ఆరోపణల కారణంగా ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) అతడిని యూపీ టీ20 లీగ్ నుంచి నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నిషేధంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. 

Also Read : నా మంత్రి పదవికి అడ్డంకి వాళ్లే.. కోమటిరెడ్డి మరో సంచలన ట్వీట్!

RCB తరపున 13 వికెట్లు తీసి

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన యష్ దయాల్ 15 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కేసుల కారణంగా యష్ దయాల్ క్రికెట్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ వివాదాలు అతడి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

2018లో ఉత్తరప్రదేశ్ తరపున లిస్ట్ A క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు యష్ దయాల్. అదే సంవత్సరంలో రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో, 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ట్వంటీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టు అతన్ని రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. 2024 ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అతన్ని రూ. 35 కోట్లకు కొనుగోలు చేసింది.

Advertisment
తాజా కథనాలు