/rtv/media/media_files/2025/02/21/1o3a8gXQaLobtt8zd0RL.jpg)
KL Rahul sacrificed his fifty for Shubman Gill century vs Bangladesh
Ind Vs Ban: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా నిన్న (గురువారం) దుబాయ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభమన్ గిల్(Shubhaman Gill) దుమ్ము దులిపేశాడు. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన గిల్ భారత్‌కు విజయాన్ని అందించి నాటౌట్‌గా నిలిచాడు. సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. మరోవైపు కేఎల్ రాహుల్(KL Rahul) సైతం అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!
కేఎల్ రాహుల్ త్యాగం
మ్యాచ్ చివరి దశకు చేరుకునే సమయంలో గిల్ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. దీంతో కేఎల్ రాహుల్ తన దూకుడును తగ్గించుకుని తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. ఇది మాత్రమే కాకుండా గతంలోనూ కేఎల్ రాహుల్ త్యాగం చేసిన దాఖలాలు ఉన్నాయి. గతంలో వన్డే ప్రపంచ కప్ 2023లో కోహ్లీ కోసం రాహుల్ చాలా నెమ్మదిగా ఆడాడు. దీంతో ఒక్కసారిగా హార్ధిక్ పాండ్యపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్ గా ముందుకు దూసుకుపోండి!
అదేంటి? ‘హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లు’ ఇప్పుడు హార్ధిక్ పాండ్య ఏం చేశాడు? అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో హార్ధిక్ పాండ్య వ్యవహరించిన తీరును నెటిజన్లు గుర్తు చేస్తూ నెట్టింట ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఒకవేళ రాహుల్ స్థానంలో హార్ధిక్ పాండ్య ఉండుంటే గనుక పరిస్థితి భిన్నంగా ఉండేదని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!
హార్ధిక్ పాండ్య పట్టించుకోడు
ఎందుకంటే హార్ధిక్ పాండ్య అవతలి బ్యాటర్ గురించి అస్సలు పట్టించుకోడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. దానికీ ఓ కారణం ఉందంటున్నారు. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 159 రన్స్ చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 17.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఫినిష్ చేసింది.
గతంలో ఏం చేశాడంటే?
అప్పటికి క్రీజ్‌లో తిలక్ వర్మ (49*), హార్దిక్ పాండ్య (20*) ఉన్నారు. అయితే ఇక్కడే తిలక్ వర్మ ఇంక్కొక్క పరుగు చేసుంటే హాఫ్ సెంచరీ సాధించేవాడు. కానీ హార్దిక్ అవేమి పట్టించుకోకుండా సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను పూర్తి చేశాడు. దీంతో క్రికెట్ ప్రియులు ఆశ్చర్యపోయారు. ఇంకా చాలా బాల్స్ మిగిలి ఉన్నాయ్.. అలాంటప్పుడు సిక్స్ కొట్టాల్సిన అవసరం ఏముంది? అంటూ హార్దిక్ పై ఫైర్ అయ్యారు. తిలక్ వర్మకు స్ట్రైకింగ్ ఇస్తే బాగుండేది అన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ విషయాన్నే గుర్తు చేస్తూ నెటిజన్లు హార్ధిక్ పై ట్రోలింగ్స్ మొదలు పెట్టారు.