Rishabh Pant: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమవుతున్న పంత్ ను టెస్టు జట్టునుంచి తప్పించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్టులో మ్యాచ్ గెలిపించడమో లేక డ్రా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడని భావించగా అనవసరమైన చెత్త షాట్స్ ఆడి ఔట్ కావడంతో కోచ్ తో సహా సెలక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. స్వదేశంలోనూ న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో విఫలం అయినప్పటికీ అవకాశాలు ఇస్తున్నా నిలదొక్కుకోవట్లేదంటూ మెనేజ్ మెంట్ గుర్రుగా ఉంది.
Good win and we keep working. Onto the next one. 🇮🇳🏏#RP17 pic.twitter.com/DONQYfINBL
— Rishabh Pant (@RishabhPant17) November 25, 2024
పంత్ కు బదులు ధ్రువ్ జురెల్..
అయితే భారత్, ఆస్ట్రేలియా మధ్య జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా 5వ టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్ డబ్ల్యూటీసీకి కీలకం కానుండగా బీజీటీ సిరీస్ కూడా 2-2తో సమం అవుతుంది. ఈ క్రమంలో కోచ్ గంభీర్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పంత్ 37, 1, 21, 28, 9, 28, 30 స్కోర్లకే పరిమితం కాగా.. అతన్ని తుది జట్టు నుంచి తప్పించాలని భావిస్తున్నారట. పంత్ కు బదులు ధ్రువ్ జురెల్ కు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారట. 5వ టెస్టులో సర్ఫరాజ్ ను కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Maoists: సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు