MS Dhoni: బెంగాల్ రాజకీయాల్లోకి ధోనీ.. వైరల్ అవుతున్న బీసీసీఐ ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాజకీయాల్లోకి వెళ్లే విషయమై తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడారు. ధోనీ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది ఆయన వ్యక్తిగతం అన్నారు. ఆయన బెంగాల్‌ రాజకీయాల్లోకి వస్తారని తాను ఊహించినట్లు తెలిపారు.

New Update
ms dhoni to enter politics bcci vice president rajeev shukla interesting comments

ms dhoni to enter politics bcci vice president rajeev shukla interesting comments

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపించిన పేరు ఇది. అతడు బ్యాట్ పట్టుకుని క్రీజ్ లోకి దిగుతున్నాడు అంటే మైదానంలో ప్రేక్షకులు రచ్చ రచ్చ చేసేవారు. ప్రత్యర్థి బౌలర్లు సైతం ధోనీకి ఎలాంటి బాల్ వేయాలా? అని తడబడేవారు. 

Also Read :  జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

అవతల ఎంతటి ఫాస్ట్ బౌలర్ అయినా.. ధోనీ సిక్సర్ల వర్షం కురిపించేవాడు. అంతేకాకుండా కెప్టెన్ గా తన సారథ్యంలో ఎన్నో విజయాలను భారత్ కు అందించాడు. 2007లో వరల్డ్ టీ20, 2011లో వన్డే వరల్డ్ కప్‌, 2013లో ఛాంపియన్‌ ట్రోఫీనీ భారత్ కు అందించాడు. దీంతో మూడు కప్పుల్ని సాధించి పెట్టిన ఏకైక కెప్టెన్ ధోనీనే అని చెప్పుకోవాలి. 

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు

ఇక నాలుగేళ్ల క్రితం అతడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. అయినప్పటికీ ఆయన క్రేజ్ ఎంత మాత్రమూ తగ్గలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు ఆడుతున్న కోహ్లీ, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ తో సహా ధోనీ పేరు మార్మోగిపోతుంది. 

Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇదిలా ఉంటే సాధారణంగా క్రికెట్ కు వీడ్కోలు పలికిన చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చి అక్కడ రాణిస్తుంటారు. మనోజ్ తివారీ, గంభీర్, మహ్మద్ కైఫ్, అంబటి రాయుడు ఇలా చాలా మంది ఆటగాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ శైలిలో దూసుకుపోతున్నారు. 

రాజకీయాల్లోకి ధోనీ

గతంలో ధోనీ పేరు కూడా బలంగా వినిపించింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్తారని నెట్టింటా టాక్ గట్టిగా నడిచింది. చాలా మంది ధోనీ రాజకీయాల్లోకి వెళ్లాలని సూచించారు కూడా. కానీ ధోనీ మాత్రం అవమీ పట్టించుకోకుండా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే ధోనీ రాజకీయాల్లోకి వెళ్లే విషయమై తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. 

మంచి నాయకుడు అవుతాడు

ఇది కూడా చదవండి: ఆకాశం నుంచి సాలెపురుగుల వర్షం.. ఎక్కడంటే?

ధోనీ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది ఆయన వ్యక్తిగతం అన్నారు. అయితే ఆయన బెంగాల్‌ రాజకీయాల్లోకి వస్తారని తాను ఊహించినట్లు తెలిపారు. ధోనీ రాజకీయాల్లోకి వస్తే మంచి నాయకుడు అవుతాడు అని ఆయన పేర్కొన్నారు. అతడు ఈజీగా గెలవగలడు అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో రాజీవ్ శుక్లా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు