/rtv/media/media_files/2025/09/13/team-india-1-2025-09-13-07-00-46.jpg)
కాశ్మీర్ లోని పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ను భారత్ దూరం పెట్టింది. ఆ దేశంతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని నిర్ణయం తీసుకుంది. క్రీడలతో సహా వారిని బాయ్ కాట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే ప్రస్తుతం దుబాయ్ లో ఆసియా కప్ జరుగుతోంది. ఇందులో ఆసియా దేశాలన్నీ పాల్గొంటున్నాయి. పాకిస్తాన్ కూడా మ్యాచ్ లు ఆడుతోంది. అయితే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ తో ఆడాలా వద్దా అన్న విషయంపై చాలానే చర్చ జరిగింది. మాజీలతో సహా చాలా మంది పాకిస్తాన్ ను బాయ్ కాట్ చేయాలని చెప్పారు. బోలెడన్ని రోజులు తర్జన భర్జనల తర్వాత ఫైనల్ గా ఇండియా, పాకిస్తాన్ లు మ్యాచ్ లు ఆడతాయని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ భారత ఆటగాళ్ళు ఒక్కరు కూడా నోరు విప్పలేదు.
రసవత్తరంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్
మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా భారత జట్టు ఈ విషయంపై మాట్లాడింది. అయితే తమకు ఇలాంటి విషయాలతో సంబంధం లేదని...బీసీసీఐ ఎవరితో ఆడాలని చెప్తే వారితో ఆడతామని భారత జట్టు కోచ్ సీతాన్షుకోటక్ తెలిపారు. తాము కేవలం ఆటపైనే దృష్టి పెట్టామని, బ్యాటింగ్ ఎంత బాగా చేయాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. మిగతా విషయాలన్నీ బీసీసీఐ చూసుకుంటుందని..తమకేమీ సంబంధం లేదని చెప్పారు.
పహల్గాం దాడి తర్వాత మొదటి మ్యాచ్
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ లు ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇది. దీంతో ఆదివారం జరగబోయే మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా మారనుంది. ఇదే విషయాన్ని భారత జట్టు కూడా ఒప్పుకుంది. అందుకే తాము పూర్తిగా ఆట మీదనే దృష్టి పెట్టామని చెప్పింది. అసలు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ పెద్ద పోటీనే అని అంది. మరోవైపు పాకిస్తాన్ కూడా ఉత్సాహంగా ఉంది. నిన్న ఆ దేశం ఆడిన మొదటి మ్యాచ్ లో గెలిచి..భారత్ కు సవాల్ విసరింది. ఇక టీమ్ ఇండియా కూడా యూఏఈని చిత్తుగా ఓడించి ఉత్సాహంగా ఉంది. యూఏఈని కేవలం 57 పరుగులకే కట్టడి చేయడమే కాకుండా ఆ లక్ష్యాన్న పది ఓవర్లలో ముగించి..టీ 20 కాదు టీ 10 అనేలా చేసింది.
Also Read: Trump On Tariffs: భారత్ పై సుంకాలు అంత ఈజీ కాదు..రష్యాపై చర్య కోసమే ఈ విభేదం..ట్రంప్