Trump On Tariffs: భారత్ పై సుంకాలు అంత ఈజీ కాదు..రష్యాపై చర్య కోసమే ఈ విభేదం..ట్రంప్

భారత్ పై సుంకాలు విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై చర్య తీసుకునేందుకు తమకింత కంటే మార్గం దొరకలేదని చెప్పారు. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్‌తో విభేదానికి తాము సిద్ధమయ్యామని చెప్పారు.

New Update
Trump

Trump

భారత్ పై విధించిన సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మరొకసారి భారత్ పై సుంకాల గురించి ట్రంప్చెప్పుకొచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఆ దేశం పై అదనపు సుంకాలను విధించాము. కానీ అదంత తేలికైన విషయం కాదని ట్రంప్చెప్పుకొచ్చారు. కానీ రష్యాపై ఒత్తిడి తేవాలన్నా, చర్య తీసుకోవాలన్నా భారత్ పై టారిఫ్ లు వేయక తప్పని పరిస్థితి అని అన్నారు. అందుకే ఇండియాతో విభేదానికి సిద్ధమయ్యామని చెప్పారు. అది చాలా పెద్ద చర్య. అయినా హార్డ్ డెసిషన్ తీసుకున్నాను. నేను అధ్యక్షుడిగా పదవీ బాధ్యత తీసుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయాలు చాలానే తీసుకున్నాను అంటూట్రంప్చెప్పుకొచ్చారు. రష్యాకు అతి పెద్ద చమురు వినియోగదారు భారత్. అందుకే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చెప్పారు. దీంతో పాటూ భారత్, పాక్ యుద్ధంతో సహా మరో ఏడు యుద్ధాలను తానే ఆపినట్టు మరోసారి ట్రంప్ అన్నారు.

ఈయూ, జీ7 దేశాలకు ఆదేశాలు..

రష్యా పై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ శత విధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎలా అయినా రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధం ఆపాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతానికి భారత్ తో సంధి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ మరోవైపు నుంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. దాని కోసం తాజాగా రష్యా(Russia) నుంచి చమురు ఉత్పత్తి చేసుకుంటున్న భారత్, చైనా(China) లపై అధిక సుంకాలను విధించాలని జీ 7 దేశాలపై అమెరికా ఒత్తిడి తీసుకువచ్చారు. మాస్కో యుద్ధ నిధులను తగ్గించే ప్రయత్నంలో మిత్రదేశాల నుంచి 50 నుంచి 100 శాతం సుంకాలను వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. G7 దేశాల(g7-meetings) ఆర్థిక మంత్రులతో ట్రంప్ యంత్రాంగం శుక్రవారం వీడియో కాల్ ద్వారా ఈ ప్రతిపాదనపై చర్చించనున్నట్లు చెబుతున్నారు. చైనా, భారత్ లు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ తో యుద్ధానికిఆజ్యం పోస్తున్నారని...ఉక్రేనియన్ ప్రజల అర్థం లేని చావులకు దారి తీస్తున్నారని అమెరికా ట్రెజరీ ప్రతినిధి అన్నారు. యుద్ధం ముగిసిన రోజే సుంకాలను తీసేస్తామని చైనా, భారత్ లకు చెప్పాలని జీ7 దేశాలకు సూచించామని ఆయన తెలిపారు.

దీని కన్నా ముందు యూరోపియన్ యూనియన్ తో కూడా ఇదే విషయం చెప్పారు ట్రంప్. రష్యా మరింత ఆర్థిక ఒత్తిడిని తీసుకొచ్చేందుకు భారత్, చైనాపై 100 శాతం సుంకం(trumptariffs) విధించాలని వాళ్లకి సూచించినట్లు సమాచారం. ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తామనిచెప్పేవరకు ఈ సుంకాలు కొనసాగించాలని కోరారు. ఇలా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఓ యూఎస్‌ అధికారి కూడా చెప్పారు. కానీ యూరోపియన్ యూనియన్‌(European Union) కూడా ముందుకు వస్తే దీన్ని కలిసి అమలుచేస్తామని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధికారులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు