/rtv/media/media_files/2025/02/13/Tb10iWHJ7QjWE8fPaWhu.jpg)
manik batra
Manika Batra: భారత టేబుల్ టెన్నిస్(India Table Tennis) స్టార్ ప్లేయర్, ఖేల్ రత్న(Khel Ratna Award) పురస్కార గ్రహీత మనికా బత్రా ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గిరీశ్ బత్రా (65) గుండెపోటుతో ఢిల్లీ(Delhi)లో కన్నుమూశారు. దీంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న మనికా సహచరులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా మనికా బత్రా తండ్రి అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి.
Also Read : రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
Heartbreaking Loss 💔
— Sportskeeda (@Sportskeeda) February 13, 2025
India’s table tennis star Manika Batra lost her father, Girish Batra, to cardiac arrest.
Deepest condolences to her and her family. 🕊️#TableTennis #SKIndianSports pic.twitter.com/KYVwDIVzlE
కామన్వెల్త్ క్రీడలలో భారత్ తరపున
ఇక మనిక బాత్రా గురించి మాట్లాడుకుంటే, ఆమె భారతదేశపు దిగ్గజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులలో ఒకరు. ఈమె కామన్వెల్త్ క్రీడలలో భారత్ తరపున పతకాలు సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా మానికా బాత్రా నేతృత్వంలోని భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు మహిళల ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది.
Also Read: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?
మనిక బాత్రా గతేడాది సౌదీ అరేబియా స్మాష్‌లో జరిగిన టోర్నమెంట్‌లో అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. దీంతో ఆమె తన ర్యాంకింగ్ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. టేబుల్ టెన్నిస్‌లో 24వ ర్యాంకు సాధించింది. టేబుల్ టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్-25లోకి ప్రవేశించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా మనిక నిలిచింది. మానికా భారత్ తరపున సింగిల్స్, డబుల్స్ , మిక్స్‌డ్ ఈవెంట్లలో ఆడుతుంది.
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు