/rtv/media/media_files/2024/12/10/cr1PsqRviM87AjUKa0rR.jpg)
fee regulation act
TG Private Schools: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల భారంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ స్కూళ్లలో సంవత్సరానికి రూ.20 వేల నుంచి ఏకంగా రూ.5 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. డిజిటల్ క్లాసులు(Digital Classes), ఐఐటీ కోచింగ్(IIT Coaching) లు, ట్యూషన్ ఫీ, స్పోర్ట్స్ ఫీ ఇలా రకరకాల పేరుతో అందినవరకు దోచుకుంటున్నారు. ఇలా నియమ, నిబంధనలు లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్ధికభారం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం మధ్యతరగతి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో ఫీజుల నియంత్రణకు చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఫీ రెగ్యులేషన్ కమిషన్(fee regulation act) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Also Read : ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
ముసాయిదా బిల్లు -2025 పేరుతో
ఇప్పటికే ఫీజుల నియంత్రణపై అధ్యయనం జరిపిన విద్యా కమీషన్.. తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు -2025 పేరుతో ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. జనవరి 24న విద్యా కమీషన్ ఈ బిల్లును సమర్పించింది. అయితే ప్రస్తుతం దీనిని పరీశీలిస్తున్న విద్యాశాఖ అధికారులు కొన్ని సవరణలతో త్వరలో ప్రభుత్వానికి ఫైనల్ నివేదికను అందజేయనున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ (HSPA) కూడా తన సిఫారసులను విద్యా కమిషన్‌కు సమర్పించింది.
Also Read : రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
2024 జులైలోనే విద్యారంగ సమస్యల గురించి తెలుసుకోవడానికి ప్రభుత్వం కొంతమంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అందులో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. విద్యారంగానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయమైనా కమిటీలోని మంత్రులతో చర్చిన తర్వాతే తీసుకునేలా ఏర్పాటు చేశారు. ఫీజుల నియంత్రణ బిల్లుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లోని అంశాలను కూడా అధ్యయనం చేస్తున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి ప్రభుత్వాలు 2017లో తెచ్చిన ఫీజుల నియంత్రణ చట్టాలను, గత జీవోలు విద్యాశాఖ సీనియర్ అధికారులు పరిశీలిస్తున్నారు.
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు