Sunil Gavaskar: టీమిండియా విజయం.. ఆనందంలో సునీల్ గావాస్కర్ డ్యాన్స్

టీమ్‌ ఇండియా విజయం పట్ల లెజండరీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆనందంతో స్టేడియంలో స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్న పిల్లాడిలా క్యూట్‌గా సునీల్ డ్యాన్స్ వేశారని అంటున్నారు.

New Update
Suneel Gavaskar Dance video

Suneel Gavaskar Dance video Photograph: (Suneel Gavaskar Dance video)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా ఘన విజయం సాధించడంతో యావత్తు భారత్ సంబరాలు చేసుకుంటుంది. న్యూజిలాండ్‌పై టీమిండియా జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే టీమిండియా విజయ ఆనందాన్ని లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ డ్యాన్స్ రూపంలో చూపించారు. మైదానంలో చిన్న పిల్లవాడిలా డ్యాన్స్ చేస్తూ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వయస్సులో కూడా సునీల్ గావాస్కర్ ఇలా డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు. సునీల్ డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

ఇది కూడా చూడండి: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్

4 వికెట్ల తేడాతో గెలిచి..

ఇదిలా ఉండగా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. రోహిత్ 76 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ (1) ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశపర్చాడు. శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (34*), శుభ్‌మన్ గిల్ (31), అక్షర్ పటేల్ (29), హార్దిక్ పాండ్య (18), రవీంద్ర జడేజా (9*) పరుగులు చేశారు. మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో ఓవర్ ఉండగానే ఘన విజయం సాధించింది.

ఇది కూడా చూడండి: ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు