/rtv/media/media_files/2025/04/25/h9xUojrvTaHyBRHV1Pv9.jpg)
CSK Vs SRH Photograph: (CSK Vs SRH)
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ సీఎస్కే vs ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన SRH జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో CSK జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ రెండు జట్లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాయి. వరుసగా పరాభవాలతో రెండు జట్లలోనూ ఆత్మవిశ్వాసం లోపించింది. ఆరేసి ఓటములు, రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి.
ధోనీ 400వ టీ20 మ్యాచ్
ఇదిలా ఉంటే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇది 400వ టీ20 మ్యాచ్. అతడు తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్‌ను SRHతో ఆడనున్నాడు. దీంతో భారత్ నుంచి నాలుగో ప్లేయర్‌గా ధోనీ నిలిచాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 24వ ఆటగాడిగా ఉన్నాడు. ధోనీ కంటే ముందు మరో ముగ్గురు ఉన్నారు. వారు.. రోహిత్ శర్మ 456 మ్యాచ్‌లు, దినేశ్ కార్తిక్ 412 మ్యాచ్‌లు, విరాట్ కోహ్లీ 408 మ్యాచ్‌లు ఆడారు. ఆ తర్వాత స్థానంలో ధోనీ ఈ ఘనత అందుకొన్నారు. ధోనీ ఇప్పటివరకు 399 మ్యాచులు ఆడాడు. అందులో మొత్తం 7,566 పరుగులు చేశాడు.
telugu-news | IPL 2025 | latest-telugu-news | CSK Vs SRH