/rtv/media/media_files/2025/10/02/siraj-2025-10-02-14-45-59.jpg)
అహ్మదాబాద్ వేదికగా టీమ్‌ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి టెస్టు మ్యాచ్ లో భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, బుమ్రా చెలరెగిపోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయింది. మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీసి కరేబియన్ జట్టు టాప్ ఆర్డర్‌ను కోలుకోకుండా చేశాడు. దీంతో సిరాజ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Two opening bowlers vs the two opening batters.
— BCCI (@BCCI) October 2, 2025
Watch Siraj and Bumrah pick a wicket apiece in the 1st Test.
Live - https://t.co/Dhl7RtiY7q#INDvWI#1stTEST#TeamIndia@IDFCfirstbankpic.twitter.com/glkuCsTGpR
Also Read : టీమిండియా చిరుతలు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రికార్డుల సునామీ..
టాప్ ప్లేస్‌ను సొంతం
2025 క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు ఏకంగా 31 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతానికి ఈ జాబితాలో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ లిస్టులో ఆసీస్ బౌలర్లైన మిచెల్ స్టార్క్ (29 వికెట్లు), నాథన్ లైయన్ (24), కరేబియన్ బౌలర్ షామర్ జోసెఫ్ (22)ను సిరాజ్ అధిగమించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే వెస్టిండీస్ జట్టులో జస్టిస్ (32) మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా, బుమ్రా3, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
Also Read : ఆడు మగాడ్రా బుజ్జి.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ..