T20 Player Rankings 2025: ఆడు మగాడ్రా బుజ్జి.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ..

టీ20ఐ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 931 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ (909) రికార్డును బద్దలు కొట్టి, అత్యధిక పాయింట్లు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అభిషేక్ అద్భుత ప్రదర్శనతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

New Update
ICC T20I rankings abhishek sharma breaks world record virat kohli asia cup

ICC T20I rankings abhishek sharma breaks world record virat kohli asia cup

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ఇటీవల ఆసియా కప్ 2025 టోర్నీలో అదరగొట్టేశాడు. ఓపెనర్‌గా తనదైన శైలిలో దుమ్ము దులిపేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఎంతటి స్టార్ బౌలర్‌నైనా ఎదుర్కొని పరుగుల వరద పెట్టించాడు. తాజాగా అతడు అరుదైన ఘనత సాధించాడు. ఐసిసి పురుషుల టి20 ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో చరిత్ర సృష్టించాడు. 

ICC T20I rankings

2025 ఆసియా కప్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో ఈ 25 ఏళ్ల లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్ 931 రేటింగ్ పాయింట్లను సాధించాడు. ఇది అతడి బెస్ట్ స్కోర్. అదే సమయంలో అభిషేక్ శర్మ ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ మలన్ రికార్డును బద్దలు కొట్టాడు. మలన్ 2020 నుండి 919 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అతడి రికార్డును అభిషేక్ బ్రేక్ చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు.   

దీంతో అభిషేక్ ఈ టోర్నమెంట్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అతడి సగటు 45 కాగా, అతని స్ట్రైక్ రేట్ 200గా ఉంది. ఇవే అభిషేక్‌ను T20లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టాయి. సూపర్ ఫోర్స్‌లో అభిషేక్ శర్మ.. శ్రీలంకపై 61, బంగ్లాదేశ్‌పై 75 పరుగులు చేయడంతో అతడి రేటింగ్ 931కి చేరుకుంది. అయితే పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో అతను కేవలం 5 పరుగులకే ఔటైనా.. మునుపటి ఇన్నింగ్స్ భారతదేశం విజయానికి పునాదిలా నిలిచాయి.

కోహ్లీ రికార్డు బద్దలు

ఈ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో అభిషేక్.. మలన్‌ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా.. భారత బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ రికార్డును సైతం వెనక్కి నెట్టాడు. కోహ్లీ కెరీర్‌లో అత్యధికంగా 909 పాయింట్ల రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. 

ఇతర టీమిండియా ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు జరిగాయి. ఆసియా కప్ 2025 టోర్నీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను మట్టిగరిపించిన తిలక్ వర్మ 28 పాయింట్లు పెరిగి మూడో స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఫిల్ సాల్ట్ కంటే 25 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ ఈ ఆసియా కప్ 2025 టోర్నీలో పెద్దగా ఆడలేకపోయాడు. అతడి పేలవమైన ఫామ్ కారణంగా ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. కుల్దీప్ యాదవ్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొమ్మిది స్థానాలు పైకొచ్చి 12వ స్థానానికి చేరుకున్నాడు. 

Advertisment
తాజా కథనాలు