/rtv/media/media_files/2025/07/05/shubman-gill-history-created-in-ind-vs-eng-second-test-match-2025-07-05-21-11-26.jpg)
Shubman Gill HISTORY CREATED IN IND VS ENG SECOND TEST MATCH
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ దుమ్ముదులిపేస్తున్నాడు. వరుసగా సెంచరీలు చేస్తూ పరుగులు రాబడుతున్నాడు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గిల్ 140కి పైగా పరుగులు సాధించాడు. ఇక ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సైతం తన బ్యాటింగ్‌తో అదరగొట్టేస్తున్నాడు.
రెండో టెస్ట్ మ్యాచ్‌లో చెలరేగిపోతున్నాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బస్టన్‌లో జరుగుతున్న ఈ సెకండ్ టెస్ట్‌లో విజృంభిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేసి భారీ రికార్డులను క్రియేట్ చేశాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా కెప్టెన్ గిల్ తన బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తున్నాడు.
ఈ సెకండ్ ఇన్సింగ్స్‌లోనూ సెంచరీ సాధించడం ద్వారా గిల్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. దీనితో పాటు దిగ్గజ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడానికి ముందే శుభ్‌మన్ గిల్ తన పేరు మీద 5 పెద్ద రికార్డులను సృష్టించాడు.
Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!
🚨 HISTORY CREATED BY GILL. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2025
- Shubman Gill has most runs in a Test match for India. 🇮🇳 pic.twitter.com/UdD0OFI99l
HISTORY CREATED BY GILL
ఇంగ్లీష్ గడ్డపై 1 టెస్ట్ మ్యాచ్‌లో 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా గిల్ నిలిచాడు.
టెస్ట్ మ్యాచ్‌లో 300 పరుగుల మార్కును దాటిన తొలి భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.
కెప్టెన్‌గా మొదటి 2 టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగుల రికార్డు కూడా గిల్ పేరు మీదే నమోదైంది.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. గిల్ ఇప్పటివరకు 482 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు 449 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ పేరిట ఉంది.
గిల్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు లెజెండరీ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది.
Also Read : రూ. 20వేలలో బెస్ట్ స్మార్ట్‌టీవీలు - మార్కెట్లో దుమ్మురేపుతున్న మోడల్స్ ఇవే!!