/rtv/media/media_files/2025/03/10/MCTKDApLvP49BSjqxR2I.jpg)
Shoaib Akhtar Photograph: (Shoaib Akhtar)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిర్వహించిన ఈ ట్రోఫీలో టీమిండియా న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించింది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ అతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని భద్రతా కారణాల వల్ల టీమిండియా పాక్‌కు వెళ్లడానికి నిరాకరించింది. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో మ్యాచ్‌లు నిర్వహించింది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
This is literally beyond my understanding.
— Shoaib Akhtar (@shoaib100mph) March 9, 2025
How can this be done???#championstrophy2025pic.twitter.com/CPIUgevFj9
ఇది కూడా చూడండి:HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్
ఒక్క ప్రతినిధి కూడా ప్రెజెంటేషన్‌కి..
ఇదిలా ఉండగా ఫైనల్ ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి ఆతిథ్య పాకిస్థాన్ నుంచి ఏ ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదు. పార్లమెంట్ సమావేశాల కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నక్వీ ప్రెజెంటేషన్‌కి హాజరు కాలేదు. అలాగే పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ దుబాయ్‌లోనే ఉన్నారు. కానీ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పీసీబీ తీరుపై విమర్శలు చేశారు. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఇది కూడా చూడండి:ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!
ప్రెజెంటేషన్‌కి పీసీబీ నుంచి ఏ ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదు. ఇది ఐసీసీ నిర్వహించిన కార్యక్రమం. పీసీబీ నుంచి ఏ ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదన్నారు. భారత్ ఫైనల్‌కి వచ్చినందుకే హాజరు కాలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడం వల్ల కావాలనే తమ ప్రతినిధులను పంపించకుండా ఉందనేది వారి అభిప్రాయమని అంటున్నారు. పాకిస్థాన్ దాదాపు 29 ఏళ్ల తర్వాత ఆతిథ్యం ఇచ్చింది. సొంత గడ్డపై ఆడిన పాక్ కనీసం సెమీస్ కూడా చేరుకోలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.