/rtv/media/media_files/2025/01/31/Er3NjyOrSXsd5OYKzv09.jpg)
Sachin Tendulkar to be honoured with BCCI Lifetime Achievement Award
సచిన్ తెందూల్కర్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌కు ఎన్నో విజయాలు, కప్‌లు తెచ్చిపెట్టడంలో ఆయన కీలక పాత్ర వహించారు. ఒకానొక సమయంలో టీమిండియా జట్టు ఓటమికి దగ్గరలో ఉందనుకుంటున్నప్పుడు సచిన్ తన బ్యాటింగ్‌తో విజయపథంవైపు తీసుకెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. భారత్ తరఫున సుమారు 664 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్ కూడా సచిన్ కావడం గర్వించదగ్గ విషయమనే చెప్పాలి.
భారత క్రికెట్ బోర్డు సత్కారం
ఇక ఈ టీమిండియా క్రికెట్ దిగ్గజాన్ని భారత క్రికెట్ బోర్డు ఘనంగా సత్కరించనుంది. ఈ శనివారం జరగబోయే వార్షికోత్సవంలో సచిన్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందజేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి.
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును సచిన్‌కు అందజేయనున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు భారత క్రికెట్‌కు సచిన్ అందించిన సేవలు అమోఘం అని చెప్పుకొచ్చాయి. దీంతో సచిన్‌కు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.
Also Read : ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా.. కొత్త రికార్డులను సైతం క్రియేట్ చేసిన సచిన్‌కు అవార్డు ఈ రావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీంతో ఈ అవార్డు అందుకోబోతున్న 30వ భారత క్రికెటర్‌గా సచిన్ నిలవనున్నారు. కాగా సచిన్ 664 మ్యాచ్‌లు ఆడగా.. మొత్తం 34,357 పరుగులు సాధించారు. అందులో 100 సెంచరీలు ఉన్నాయి. సచిన్ 2013లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?