/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-50-1-jpg.webp)
Rishabh Pant reveals Dressing Room Secrets
Rishabh Pant: భారత క్రికెట్, ఐపీఎల్ టోర్నీ టైమ్ లో డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలను బయటకు వెళ్లడించడంపై రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పంత్ ను.. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, విమర్శల నుంచి టీమ్ మెంబర్స్ ఎలా రెస్పాండ్ అవుతారని ప్రశ్నించారు. అలాగే కెప్టెన్ టీమ్ సభ్యులను ఎలా రక్షించుకుంటాడు, రేపు లక్నో జట్టుకు కెప్టెన్ అయితే జట్టును ఎలా సేవ్ చేస్తావనే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.
Thank you, @DrSanjivGoenka sir for the kind words, trust and opportunity. Exciting times ahead, looking forward to it. 🙂 https://t.co/mG25DTNbLO
— Rishabh Pant (@RishabhPant17) January 20, 2025
1000 విషయాలు మాట్లాడుకుంటాం..
ఈ మేరకు పంత్ మాట్లాడుతూ.. లోపల మాట్లాడుకునే విషయాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ‘టీమ్ పర్సనల్, ఇంటర్నల్ డిష్కసన్ లో 1000 విషయాలు మాట్లాడుకుంటాం. కానీ ప్రతి ఆటగాడికీ కెప్టెన్ మద్దతు ఇస్తాం. వెనకనుంచి సపోర్ట్ అందిస్తాం. కొన్నిసార్లు ప్లేయర్లను ట్రోలింగ్ లేదా విమర్శల నుంచి రక్షించుకోవాలి. ప్రతి విషయం ప్లేయర్లతో చెప్పాల్సిన అవసరం లేదు. డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నా ముందున్న కర్తవ్యం 200 శాతం ఆటతీరును ప్రదర్శించడమే. గ్రౌండ్ లోకి దిగిన తర్వాత ఇతర విషయాల గురించి ఆలోచించను. మ్యాచ్ గెలిపించడమే లక్ష్యం' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Donald Trump: భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్!
టీమ్ ఇండియా కెప్టెన్ కాబోతున్నారనే అనే ప్రశ్నలపై కూడా స్పందించాడు. రోడ్డు ప్రమాదం జరగకుముందు దాని గురించి ఆలోచించేవాడిని. కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదు. కేవలం ఆడటంపైనే దృష్టి పెట్టాను. ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. రోడ్డు యాక్సిడెంట్ నాకు చాలా విషయాలు నేర్పింది. మన పని దృష్టిపెడితే ఫలితం అదే వస్తుందన్నాడు రిషబ్ పంత్.