CSK VS RR: ప్లే ఆఫ్స్ కు వెళ్ళకపోయినా...విజయంతో ముగించిన రాజస్థాన్

రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది. ఈరోజు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సీఎస్కే ఇచ్చిన 187 పరుగులు లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

New Update
ipl

CSK VS RR

ప్లే ఆఫ్స్ కు వెళ్లలేకపోయినా చివరి మ్యాచ్ లో విజయం సాధించి గౌరవాన్ని దక్కించుకుంది రాజస్థాన్ రాయల్. ఐపీఎల్ 18 సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది.  వైభవ్‌ సూర్యవంశీ  33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 పరుగులు,  కెప్టెన్ సంజు శాంసన్‌  31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ లతో 41 పరుగులు, యశస్వి జైస్వాల్‌  19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 పరుగులు చేసి రాణించారు. చివర్లో ధ్రువ్ జురెల్  12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31 పరుగులు, హెట్‌మయర్  5 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స తో 12 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించారు. చెన్నై బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ 2, అన్షుల్‌ కాంబోజ్‌, నూర్‌ అహ్మద్‌ ఒక్కో వికెట్‌ తీశారు. దీంతో చెన్నై పది మ్యాచ్ లు ఓడిపయింది. అయితే ఈ జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ ఆడడానికి మిగిలే ఉంది. 

టాస్ గెలిచిన ఆర్ఆర్..

ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.  దీంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ దిగింది.  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.  చెన్నై ఆటగాళ్లలో ఆయుష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివం దుబే(39) పరుగులు చేశారు. డెవాన్ కాన్వే(10), ఉర్విల్ పటేల్(0), రవిచంద్రన్ అశ్విన్(13), ధోనీ(16)విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ చెరో మూడు వికెట్లు తీయగా..  తుషార్ దేశ్‌పాండే, వానిండు హసరంగా తలో వికెట్ తీశారు.  

 today-latest-news-in-telugu | IPL 2025 | csk vs RR | match | cricket

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు