RR VS LSG: అరే ఏంట్రా ఇదీ...రెండు పరుగుల తేడాతో ఓడిన రాజస్థాన్

ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ రెండంటే రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. 

New Update
ipl

RR VS LSG

ఆర్ఆర్ చాలా బాగా ఆడింది. కానీ చివరి ఓవర్లో లక్నో బౌలర్ల చేతికి మ్యాచ్ పోగొట్టుకున్నారు. కేవలం రెండంటే రెండే పరుగులు తేడాతో రాజస్థాన్ మ్యాచ్ ను పొగొట్టుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (74), రియాన్‌ పరాగ్‌ (39), వైభవ్‌ సూర్యవంశీ (34) పరుగులు చేశారు. ఆఖరి ఓవర్‌లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. అవేశ్‌ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లలో పరుగులు తక్కవుగా ఇవ్వడమే కాకుండా వుసగా వికెట్లు కూడా తీశారు లక్నో బౌలర్లు. చివరి ఓవర్లో ఆవేశ్ ఖాన్ 6 పరుగులే ఇచ్చి హెట్‌మయర్ (12)ను ఔట్ చేశాడు. లక్నో బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 3, శార్దూల్‌ ఠాకూర్‌, మార్‌క్రమ్‌ చెరో వికెట్‌ తీశారు. 

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్..

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో లఖ్‌నవూ బ్యాటర్స్ ఊరించి ఉసూరుమనిపించారు. ఇన్నింగ్స్ మొదటధాటిగా ఆరంభించినా చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 180/5 పరుగులు చేశారు. మార్కరమ్ 66, బదోనీ 50 పరుగులు చేశారు.  ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్  45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆయుష్ బదోని  34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌ తో 50 పరుగులతో అర్ధ శతకాలు బాదారు. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అబ్దుల్ సమద్  10 బంతుల్లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు.  నాలుగు సిక్స్‌లు కూడా బాదాడు. దీంతో  లక్నో స్కోరు 180కి చేరింది. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లలో వానిందు హసరంగ 2, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ పడగొట్టారు.

today-latest-news-in-telugu | IPL 2025 | rr | lsg | match

Also Read: BIG BREAKING: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలివే!


Advertisment
తాజా కథనాలు