BCCI New President: రోజర్ బిన్నీ ఔట్.. బీసీసీఐ కొత్త చీఫ్ ఎవరంటే?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకున్నారు. దీంతో సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికలు వరకు రాజీవ్ శుక్లా తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

New Update
bcci

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకున్నారు. దీంతో సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికలు వరకు రాజీవ్ శుక్లా తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. BCCI నిబంధనల ప్రకారం70 ఏళ్ల వయస్సు దాటిన ఏ అధికారి అయినా తన పదవిలో కొనసాగడానికి అర్హులు కారు. దీంతో బిన్నీ జూలై 19, 2025న 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.  కాగా శుక్లా ప్రస్తుతం 65 సంవత్సరాలు, 2020 నుండి ఆయన BCCI ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్‌లో జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వరకు ఆయన బోర్డు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. వచ్చే నెలలో ఎన్నికల్లో బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. ఒకవేళ ఆయన ఎన్నిక కాకపోతే బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు వస్తారు.

Also Read:  Trump Tariffs Effect: ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. ఆ క్యాంపస్‌లో యూఎస్ బ్రాండ్స్ కోకా కోలా, పెప్సీకో డ్రింక్స్ నిషేధం!

రోజర్ బిన్నీ గురించి

ఇక రోజర్ బిన్నీ 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడు. 2022 అక్టోబర్ లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన బెంగళూరులో  1955 జూలై 19న జన్మించారు. 1979లో పాకిస్థాన్‌తో తన సొంత మైదానం బెంగళూరులో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని ప్రపంచ కప్ విజేత జట్టులో బిన్నీ కీలక సభ్యుడు. ఆ టోర్నమెంట్‌లో 18 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు.

Also Read :   Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!

ఆస్ట్రేలియాలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో కూడా బిన్నీ 17 వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆట నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత, 2000లో శ్రీలంకలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. 2019 నుండి 2022 వరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడిగా పనిచేశారు. 2022 అక్టోబర్ 18న సౌరవ్ గంగూలీ స్థానంలో బిన్నీ బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక రోజర్ బిన్నీ భారత్ తరఫున ఆడిన తొలి ఆంగ్లో-ఇండియన్. ఆయన కుమారుడు స్టువర్ట్ బిన్నీ కూడా భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 

Also Read :  Hero Vishal: కాబోయే భార్యను పరిచయం చేసిన హీరో విశాల్.. ఎంగేజ్మెంట్ పిక్స్ చూశారా!

#BCCI New President: #sports #bcci #cricket #telugu-news
Advertisment
తాజా కథనాలు