Hero Vishal: కాబోయే భార్యను పరిచయం చేసిన హీరో విశాల్.. ఎంగేజ్మెంట్ పిక్స్ చూశారా!

తమిళ హీరో విశాల్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన కాబోయే భార్యను పరిచయం చేశారు. ఈరోజు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సాయి ధనిక అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నారు.

New Update
hero Vishal got engaged

hero Vishal got engaged

తమిళ హీరో విశాల్ తన పుట్టినరోజు(Hero Vishal Birthday) సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన కాబోయే భార్యను పరిచయం చేశారు. ఈరోజు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య  తన ప్రేయసి  సాయి ధన్సికను (Sai Dhanshika)  నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేశారు. దీంతో అభిమానులు, సినీ తారలు విశాల్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న విశాల్, సాయి ధన్సిక ఈ ఏడాది మేలో తమ ప్రేమను విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Also Read :  పచ్చని చీరలో అనికా.. క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్న బ్యూటీ!

అందుకోసం పెళ్లి పోస్ట్ పోన్ 

అయితే వాస్తవానికి ఈరోజు వారి పెళ్లి జరగాల్సి ఉండేది. కానీ విశాల్ జనరల్ సెక్రెటరీగా  వ్యవహరిస్తున్న ' నడిగర్ సంఘం' (సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) భవన నిర్మాణ పనుల్లో బిజీగా ఉండడంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో విశాల్ ఈ భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. త్వరలోనే తన పెళ్లి తేదీని ప్రకటించనున్నారు విశాల్. 

ఇదిలా ఉంటే విశాల్ కాబోయే భార్య  సాయి ధన్సిక కూడా  ఇండస్ట్రీకి  చెందిన అమ్మాయే. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సాయి  ధన్సిక తన నటన నైపుణ్యంతో లీడ్ హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.  రజినీకాంత్  కబాలి సినిమాలో హీరో కూతురిగా అలరించింది. ఆ తర్వాత  షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి వంటి టాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. 

ఇక విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన 'మకుటం' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా ఒక చిన్న గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. పోర్ట్ ఏరియా, స్మగ్లింగ్  నేపథ్యంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. విశాల్ 35వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. 

Also Read :  ఆ ఒక్క సినిమా కోసం నెలరోజులు డైరెక్టర్ చుట్టూ తిరిగిన కింగ్ .. నాగార్జున  బర్త్ డే స్పెషల్

Advertisment
తాజా కథనాలు