/rtv/media/media_files/2025/07/28/rishabh-pant-ruled-out-of-5th-test-2025-07-28-06-42-30.jpg)
rishabh pant ruled out of 5th test
భారత్ vs ఇంగ్లాండ్ మధ్య రసవత్తరమైన టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగానే నాలుగో సిరీస్‌ను భారత్ డ్రాగా ముగించింది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరగగా.. అందులో భారత్ ఒకటి, ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లు గెలిచింది. మరొకటి డ్రా అయింది. ఈ సిరీస్‌లో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 31వ తేదీన లండన్‌లోని ఓవల్ వేదికగా జరగనుంది.
Also Read : ఈ వారం థ్రిల్లే థ్రిల్లు.. మీ మొబైల్ కి రాబోతున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే!
Rishabh Pant Ruled Out Of 5th Test
ఈ క్రమంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా వికెట్ కీపర్& బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ గాయంతో ఐదో టెస్ట్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రిషభ్ పంత్ కుడి కాలుకు గాయం కావడంతో అతడు ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఆడటం లేదని పేర్కొంది. అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అతడి ప్లేస్‌లో తమిళనాడు వికెట్ కీపర్ & బ్యాటర్ జగదీశన్‌ను సెలెక్ట్ చేసినట్లు తెలిపింది.
Also Read : నలుగురు యువకులతో భార్య.. భర్తని ఏం చేసిందంటే?
🚨 𝗦𝗾𝘂𝗮𝗱 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 🚨
— BCCI (@BCCI) July 27, 2025
Rishabh Pant ruled out of fifth Test due to injury; N Jagadeesan named replacement.
All The Details 🔽 #TeamIndia | #ENGvIND
Also Read : బుర్రపాడు ఆఫర్.. హైక్లాస్ కెమెరా ఫోన్‌పై పిచ్చెక్కించే డిస్కౌంట్ మావా - అస్సలు వదలొద్దు!
పంత్‌కు ఎలా గాయం అయింది..
మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గాయం అయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా పంత్ కుడి కాలి బొటనవేలికి బలంగా తాకింది. ఈ దెబ్బకు పంత్ కాలి బొటనవేలుకు ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్‌లో తేలింది. ఈ గాయం కారణంగా పంత్ నొప్పిగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ కొనసాగించి అర్ధ సెంచరీ (54) సాధించాడు. అయితే వికెట్ కీపింగ్ చేయలేకపోయాడు.
Also Read : శివునితోపాటు సోమవారం ఏ దేవతలను పూజించాలో తెలుసా..?
rishabh-pant | IND VS ENG TEST SERIES 2025 | ind-vs-eng