This Week Ott Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో థ్రిల్ పంచేందుకు బోలెడు సినిమాలు, సీరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లో పెద్దగా సందడి లేకపోయినప్పటికీ ఓటీటీలలో మాత్రం వినోదం వెల్లివిరుస్తోంది. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలు, థ్రిల్లింగ్ సీరీస్ లు చూసి ఎంజాయ్ చేయవచ్చు. మరి ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో చూసేద్దామా?
థియేటర్ మూవీస్
కింగ్డమ్
విజయ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ 'కింగ్డమ్' జులై 31న థియేటర్స్ లో విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. ఇందులో భాగ్యశ్రీ కథానాయికగా నటించగా.. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఉసురే
యంగ్ టాలెంట్ టీజై అరుణాచలం, జననీ కునశీలన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'ఉసురే' ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నవీన్ డి గోపాల్ దర్శకత్వం వహించారు. ఇందులో సీనియర్ నటి రాశి కీలక పాత్ర పోషించారు.
'సర్ మేడమ్'
విజయ్ సేతుపతి- నిత్యామీనన్ జంటగా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందిన 'సర్ మేడం' ఆగస్టు 1న థియేటర్స్ లో విడుదల కానుంది. తమిళ్లో తలైవన్, తలైవి పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'సర్ మేడమ్' టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
'సన్నాఫ్ సర్దార్ 2'
అజయ్ దేవగన్- మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సన్నాఫ్ సర్దార్ 2' ఆగస్టు 1న విడుదల కానుంది. గతంలో వచ్చిన 'సన్నాఫ్ సర్దార్' కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఓటీటీ సినిమాలు
- ద ప్లాట్ - జూలై 25
- ద సస్పెక్ట్ - జూలై 2
- లయన్స్ గేట్ ప్లే
- సౌంకన్ సౌంకనీ 2 - జూలై 25
సన్ నెక్స్ట్
- ఎక్స్ & వై - జూలై 25
- షో టైమ్ - జూలై 25
అమెజాన్ ప్రైమ్
- మార్గన్- జూలై 25
- నోవాక్సిన్ - జూలై 25
- రంగీన్ - జూలై 25
నెట్‌ఫ్లిక్స్
- మండల మర్డర్స్ - జూలై 25
- ట్రిగ్గర్ - జూలై 25
- దివిన్నింగ్ట్రై- - జూలై 25
- ఆంటిక్డాన్- జూలై 25
Also Read:Meenaakshi Chaudhary: పడుకొని ఫొటోలకు ఫోజులిస్తున్న మీనాక్షి.. అబ్బా భలే ఉంది!