RCB vs PBKS : వీడని వర్షం... రాత్రి 11 గంటలకు 5 ఓవర్ల మ్యాచ్!

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పుజ్ఝాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ దాదాపుగా కష్టమేనని తెలుస్తోంది.  షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకే టాస్ పడాల్సి ఉండగా..  వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా చినుకులు ఏ మాత్రం తగ్గడం లేదు.

New Update
match cancel

match cancel

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ దాదాపుగా కష్టమేనని తెలుస్తోంది.  షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకే టాస్ పడాల్సి ఉండగా..  వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా చినుకులు ఏ మాత్రం తగ్గడం లేదు.  భారీ వర్షం కురవడంతో స్టేడియాన్ని కవర్లతో కప్పి ఉంచారు.బెంగళూరు నగరంలో గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా అదే పరిస్థితి అక్కడ ఉంది.  చినుకులు ఏ మాత్రం తగ్గకపోవడంతో దాదాపుగా మ్యాచ్ జరగడం కష్టమని క్రికెట్ నిపుణులు అంటున్నారు.  ఒకవేళ మ్యాచ్ క్యాన్సిల్ అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ వెళ్తుంది. లేదా మ్యాచ్  రాత్రి10:54 వరకు స్టార్ట్ అయితే ఆపై 5 ఓవర్ల మ్యాచ్ ఉంటుంది. వర్షం వల్ల టాస్‌ ఆలస్యం కావడం... ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. 

Also read: Rahul Gandhi: రోహిత్ వేముల పేరుతో చట్టం.. CMకు రాహుల్ గాంధీ లేఖ

జట్లు ఇవే

PBKS : ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (సి), నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్ (WK)/మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వ్యక్షక్

RCB :  ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (c), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (wk), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ

Also read :  ట్రైన్లో నాపై అత్యాచారయత్నం జరిగింది.. బాధితురాలు సంచలన కామెంట్స్!

Also read; GST on UPI: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లుకు భారీ షాక్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు