/rtv/media/media_files/2025/05/31/27Er8YA0J0rFrFpi60ay.jpg)
Rashid Khan Registers Unwanted Record in IPL 2025 season
Rashid Khan: రషీద్ ఖాన్ ప్రపంచంలోనే అత్యుత్తమ T20 బౌలర్లలో ఒకడిగా బాగా పేరు సంపాదించుకున్నాడు. తన బౌలింగ్ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టించగల సత్తా ఉన్నోడు రషీద్. ఎంతటి స్టార్ బ్యాటర్‌ను అయినా.. మెలికలు తిప్పే బౌలింగ్‌తో చెమటలు పట్టిస్తాడు. ఇంతటి స్టార్ బౌలర్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
Rashid Khan worst Record
ఈ సీజన్ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు సమర్పించుకున్న బౌలర్‌గా రషీద్ ఖాన్ చెత్త రికార్డును అందుకున్నాడు. దీనిపై రషీద్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బ్యాటర్లను కట్టడి చేయడంలో కఠినంగా ఉండే రషీద్ ఖాన్.. ఈ సీజన్‌లో మాత్రం పేవలమైన ప్రదర్శన చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ అత్యధికంగా సిక్సులు సమర్పించడంతో అయోమయంలో పడ్డారు.
ప్రస్తుతం రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్(Gujarath Titans) తరఫున ఆడుతున్నాడు. ఈ ఆల్‌రౌండర్‌ని ఐపీఎల్ ఆక్షన్‌లో రూ.18 కోట్లకు కొనుక్కున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ పేవల ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో మరో రెండు సిక్సులు ఇవ్వడంతో.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా రషీద్ ఖాన్ ఇచ్చిన మొత్తం సిక్సర్ల సంఖ్య 33కు చేరింది. దీంతో మొత్తం IPL చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు రషీద్ ఖాన్.
Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?
కాగా గతంలో ఈ చెత్త రికార్డు మహమ్మద్ సిరాజ్ పేరిట ఉండేది.. అతడు 2022లో ఆర్సీబీ తరఫున ఆడి దాదాపు 31 సిక్సులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు. మరోవైపు రషీద్ తన బౌలింగ్‌లో వికెట్లు కూడా ఎక్కువగా పడగొట్టలేకపోయాడు. మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్ కేవలం 9 వికెట్లు మాత్రమే తీశాడు. ఇది అతడి ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యల్ప వికెట్ల సంఖ్యగా నమోదు అయింది.
ఈ లిస్టులో మరికొందరు ఉన్నారు.
2022లో మహమ్మద్ సిరాజ్ 31 సిక్సులు.
2024లో యుజ్వేంద్ర చాహల్ 30 సిక్సులు.
2022లో వనిందు హసరంగ 30 సిక్సులు.
2018లో డ్వేన్ బ్రావో 29 సిక్సులు ఉన్నాయి.