Ranji Trophy : రంజీ ట్రోఫీలో 38 ఏళ్ల తర్వాత అరుదైన ఫీట్ నమోదైంది. హరియాణా పేసర్ అన్షుల్ కాంబోజ్ కేరళతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి చరిత్రలో నిలిచాడు. రంజీ ట్రోఫీ హిస్టరిలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. 30.1 ఓవర్లలో కేవలం 49 పరుగులే ఇచ్చి కేరళను ఒంటిచేత్తో కుప్పకూల్చాడు. అన్షుల్ ధాటికి కేరళ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. అన్షుల్ 10 వికెట్లకు సంబంధించిన వీడియోను బీసీసీఐ నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతోంది.
Also Read : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచే అకౌంట్లలో డబ్బులు!
Also Read : కేటీఆర్ తో పాటు కేసీఆర్ కూడా జైలుకు.. రాజగోపాల్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
రంజీ చరిత్రలో మూడో బౌలర్..
ఇక అన్సుల్ కంటే ముందు మొదటిసారి ప్రేమంగ్సు మోహన్ ఛటర్జీ 1956-57లో 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. అస్సాంపై తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత ప్రదీప్ సుందరం 1985-86 సీజన్ లో ఈ ఘనత సాధించాడు. రాజస్థాన్ తరఫున ఆడిన ప్రదీప్.. విదర్భతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. మూడో రోజు ఆట ముగిసే వరకు హరియాణా 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
Also Read : మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు
Also Read : టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్!