KKR VS RR: ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ ఘన విజయం.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఓటమి

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ మరో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 206 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛేజింగ్‌కు దిగిన ఆర్ఆర్ జట్టు.. ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

New Update
KKR VS RR....

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో ఓటమిని చవిచూసింది. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 206 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛేజింగ్‌కు దిగిన ఆర్ఆర్ జట్టు.. ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

ఆర్ఆర్ బ్యాటర్లు ఎవరెన్ని కొట్టారంటే?

ఆర్ఆర్ బ్యాటర్లలో రియాన్‌ పరాగ్‌ 45 బంతుల్లో 95 పరుగులు, యశస్వి జైస్వాల్‌ 21 బంతుల్లో 34 పరుగులు, హెట్‌మయర్‌ 23 బంతుల్లో 29 పరుగులు, శుభమ్‌ దూబే 25* రాణించారు. వైభవ్ సూర్యవంశీ 2 బంతుల్లో 4 పరుగులు, కునాల్‌ సింగ్‌ రాథోడ్‌ 0, ధ్రువ్‌ జురేల్‌ 0, హసరంగ 0, ఆర్చర్ 8 బంతుల్లో 12 పరుగులతో విఫలమయ్యారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ 2 వికెట్లు, హర్షిత్‌ రాణా 2 వికెట్లు, వరుణ్‌ చక్రవర్తి 2 వికెట్లు, వైభవ్‌ అరోరా 1 వికెట్‌ తీసుకున్నారు. 

కేకేఆర్ బ్యాటర్లు ఎవరెన్ని కొట్టారంటే?

కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రూ రసెల్ 25 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. అలాగే, రఘువంశీ 31 బంతుల్లో 44 పరుగులతో మెరిసారు. మిగతావారు చేతులెత్తేశారు. సునీల్ నరేన్ 9 బంతుల్లో 11 పరుగులు, కెప్టెన్ రహానే 24 బంతుల్లో 30 పరుగులు, గుర్బాజ్ 25 బంతుల్లో 35 పరుగులు, రింకు సింగ్ 6 బంతుల్లో 19 నాటౌట్‌గా మిగలాడు. ఆర్ఆర్ బౌలర్లలో ఆర్చర్ 1 వికెట్, యుధ్వార్ సింగ్ 1 వికెట్, తీక్షన్ 1 వికెట్, రియాన్‌ పరాగ్‌ 1 వికెట్‌ తీశారు. 

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

5 ఓవర్లకు స్కోర్‌ 43/1

10 ఓవర్లకు స్కోర్‌ 86/2

KKR vs RR latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు