/rtv/media/media_files/2025/04/07/IFfjt98gndzJXJFw0oNg.jpg)
Trump
అమెరికా అధ్యక్షుటు ట్రంప్ టారీఫ్ల మోతకు నెమ్మదిగా ప్రతి స్పందనలు వస్తున్నాయి. ఆయన మొదలుపెట్టిన ఈ ట్రేడ్ వార్ ను చైనా ఇప్పటికే చాలా గట్టిగా ఎదుర్కొంటోంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా ఢీ కొనడానికి రెడీ అయింది. యూరోపియన్ యూనియన్ సైతం ట్రంప్ చర్యల్ని వ్యతిరేకిస్తూ మొదటిసారి కీలక ప్రకటన చేసింది. ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్ విధిస్తూ మార్చిలో అమెరికా చేసిన ప్రకటనకు ప్రతిగా అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధించాలన్న ప్రతిపాదనకు ఈయూ సభ్యదేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ విషయాన్ని యూరోపియన్ కమిషన్ స్పష్టం చేసింది. ఇవి ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
చాలా అన్యాయంగా ఉన్నాయి..
అమెరికా విధిస్తున్న సుంకాలు అన్యాయంగా ఉన్నాయని ఈయూ అంటోంది. దీని వలన ఇరు వైపులా నష్టమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుందని ఈయూ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అమెరికాకు తాము వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకోవడం లేదని...కేవలం ఆ దేశంతో వాణిజ్య పరమైన సమస్యల్ని చర్చించాలని మాత్రమే అనుకుంటున్నామని చెబుతోంది. ఈయూ కూటమిలో మొత్తం 27 దేశాలు ఉన్నాయి. తాము ఆశించినట్లుగా ఇరు దేశాల మధ్య న్యాయమైన రీతిలో చర్చలు జరిగితే.. ప్రతీకార చర్యలను ఎప్పుడైనా నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే ఈయూ దేశాలు ఏమేమి వస్తువులపై సుంకాలు విధిస్తారు, ఎంత విధిస్తారు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. 20 బిలియన్ల యూరోలు లక్ష్యంగా మాత్రం ఇి ఉంటాయని తెలుస్తోంది.
today-latest-news-in-telugu | usa | donald trump tariffs | us trade war
Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి