PV Sindhu Wedding : వేడుకగా పీవీ సింధు వివాహం..!

బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు తాజాగా వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం ఉదయ్‌ పూర్‌ లో ఘనంగా జరిగింది.

New Update
PV Sindhu Wedding

PV Sindhu Wedding

PV Sindhu: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌ వేదికగా ఘనంగా జరిగాయి. పీవీ సింధు ప్రముఖ వ్యాపారవేత్త , ఫ్యామిలీ ఫ్రెండ్‌ పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డెరెక్టర్‌ వెంకట దత్తసాయి ని ఆదివారం రాత్రి 11.20 నిమిషాలకు వివాహమాడారు.అత్యంత సన్నిహితుల మధ్య, ఇరు కుటుంబాల మధ్య వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.

Also Read: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి!

పెళ్లి వేడుకకు సంబంధించిన ఏ ఫొటోను కూడా పీవీ సింధు కుటుంబం బయటకు ఇవ్వలేదు. హైదరాబాద్‌లో మంగళవారం  వీరి రిసెప్షన్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. పెళ్లికి కేవల 140 మంది అతిథులు  మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది. అయితే, రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.  డిసెంబర్‌ 20న పీవీ సింధు సంగీత్‌ వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత రోజు హల్దీ, పెళ్లి కూతురు, మెహందీ వేడుకలు చేశారు.

Also Read: ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు

 సింధు చివరిసారిగా బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌లో ఆడింది. సింధు చైనా లూయో యూ ను 21-14, 21-16 తేడాతో గెలిచింది.సింధు కెరీర్‌లో bwf వరల్డ్ ఛాంపియన్‌షిప్‌, రియో ఒలింపిక్స్‌ , టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్స్‌ సాధించింది. 

Also Read: హైదరాబాద్ RTC బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్..కొత్త ఏడాది నుంచే ..!

Also Read: ఎట్టకేలకు కలుసుకున్న ఉద్ధవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రే.. వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు