TG:హైదరాబాద్ RTC బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్..కొత్త ఏడాది నుంచే ..!

ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు. దాదాపు 300 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

New Update
tgrtc

TG RTC: తెలంగాణలో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ 12 లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 24 లక్షలు దాటేసింది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో కాలు పెట్టేందుకు కూడా ఖాళీ ఉండట్లేదు. ఇదీ కాక.. పాత బస్సులు కదలనంటున్నాయి.

Also Read: Uthappa: మాజీ క్రికెటర్ ఉతప్పకు భారీ షాక్‌..అరెస్ట్ వారెంట్ జారీ

దీంతో ఉన్న బస్సుల్లో రద్దీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది. నగరంలో కొత్త బస్సులను తిప్పేందుకు రెడీ అయ్యింది. అదీ కూడా.. కాలుష్య రహిత ప్రజారవాణా దిశగా గ్రేటర్‌ ఆర్టీసీ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం నగరంలో డీజిల్‌ బస్సుకు కిలోమీటర్‌కు రూ.20 ఖర్చవుతుండగా.. ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రం రూ.8 వ్యయం అవుతోంది. హైదరాబాద్ వ్యాప్తంగా 200 బస్సులు వేర్వేరు మార్గాల్లో తిప్పడం ద్వారా రోజువారీ వ్యయంలో 10-15శాతం వరకు ఖర్చు కలిసి వస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Also Read: CBN: జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. ఏమని ట్వీట్ చేశారో తెలుసా?

ఛార్జింగ్‌ యూనిట్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తే ఆర్టీసీ పై వ్యయభారం తగ్గటంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని అధికారులు అనుకుంటున్నారు. అందులో భాగంగా విడతలవారీగా బస్సులు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది.కొత్త ఏడాదిలో 300 బస్సులు నడపాలని గ్రేటర్‌ హైదరాబాద్ ఆర్టీసీ టార్గెట్‌గా పెట్టుకుంది. భవిష్యత్తులో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను నడపాలన్న టార్గెట్‌తో ఆర్టీసీ అవసరమైన ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టింది.

Also Read: Ap School Holidays: ఏపీలో భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవులు

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో కొత్త ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు 10 ఎకరాల స్థలం కేటాయించాలని ఆర్టీసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. స్థలం కేటాయింపు జరిగిన వెంటనే పనులు చేపట్టాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 200 ఎలక్ట్రిక్‌ బస్సులు తిరుగుతున్నాయి. JBS, HCU, మియాపూర్, BHEL డిపోల్లో ఛార్జింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. హయత్‌నగర్‌ ప్రాంతంలో ఈ నెలాఖరులోగా ఛార్జింగ్‌ యూనిట్‌ను పూర్తి కానుందని తెలుస్తుంది.

Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు

జనవరిలో మరో 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను (మెట్రో ఎక్స్‌ప్రెస్‌) రోడ్డెక్కించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాణిగంజ్‌లో ఛార్జింగ్‌ యూనిట్‌ను మార్చిలోగా ప్రారంభించి మరో 100 బస్సులు తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు