/rtv/media/media_files/2025/05/09/ZFHt2Izu3WJa896D0Zdc.jpg)
PSL 2025 Postponed Indefinitely amid India-pakistan tensions
పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వాయిదా పడింది. ఈ మేరకు తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (PCB)కు చెందిన అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. PSLలో ఇంకా 8 ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
Also Read: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
అయితే వీటిని యూఏఈ(UAE)లో నిర్వహిస్తామని PSL వాయిదాకు ముందే PCB అధికారులు ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు యూఏఈ కూడా పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. తమ దేశంలో మ్యాచ్‌లు జరిపేందుకు యూఏఈ అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే వీటిని యూఏఈ(UAE)లో నిర్వహిస్తామని PSL వాయిదాకు ముందే PCB అధికారులు ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు యూఏఈ కూడా పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. తమ దేశంలో మ్యాచ్‌లు జరిపేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇక PSL మ్యాచ్‌లకు పర్మిషన్ ఇస్తే.. ఎమిరేట్స్ బోర్డును PSBకి మిత్రుడిగా చూసే అవకాశం ఉందనే కారణంతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
అంతేకాదు ఇటీవలి కాలంలో BCCI, ఎమిరేట్స్ బోర్డు మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇప్పటికే UAEలో 2021 నాటి టీ 20 వరల్డ్ కప్‌తో పాటు ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరిగింది. ICC ప్రధాన కార్యాలయం కూడా దుబాయ్‌లోనే ఉంది. అయితే ప్రస్తుతం ICCకి బీసీసీఐ మాజీ సెక్రటరీ జైషా నేతృత్వం వహిస్తున్నారు.