Pak Cricket: క్రికెటర్లకు చెల్లని చెక్.. పాక్ ప్రధాని చిల్లర చేష్టలు.. వైరల్ న్యూస్!

T20 ప్రపంచ కప్ 2009 పాకిస్తాన్ జట్టు గెలవడంతో 2.5 మిలియన్ రూపాయలు ఇస్తానని అప్పటి ప్రధాని యూసుఫ్ రజా గిలానీ హామీ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు చెల్లించలేదని, ఆ చెక్ బౌన్స్ అయినట్లు మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ ఓ పాడ్ కాస్ట్‌లో తెలిపారు.

New Update
Pakistan player Saeed Ajmal

Pakistan player Saeed Ajmal

ఇటీవల జరిగిన ఆసియా కప్‌ 2025లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ గెలిచింది. అయితే ఈ టోర్నీలో భారత్ గెలిచినప్పటికీ కప్‌ మాత్రం PCB చీఫ్ మొహ్సిన్ నఖ్వీ దగ్గర ఉంది. అతని చేతుల మీద నుంచి కప్ తీసుకోవడానికి టీమిండియా జట్టు నిరాకరించింది. దీంతో నఖ్వీ ఆసియా కప్‌తో  పారిపోయాడు. నిజానికి ఆసియా కప్ 2025 ప్రారంభం అయినప్పటి నుంచి వివాదాలే చోటుచేసుకుంటున్నాయి. భారత్, ప్యాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరచాలనం ఇవ్వలేదు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. భారత్ విజయాన్ని పహల్గామ్ దాడి బాధితులకు విజయాన్ని అంకితం చేసినట్లు సూర్యకుమార్ యాదవ్‌ తెలిపారు. దీన్ని కూడా పీసీబీ వివాదం చేసింది. ఇదిలా ఉంటే.. దేశ రాజకీయాల కోసం తమ ఆటగాళ్లను పీసీబీ మోసం చేసిందని పాక్ మాజీ క్రికెటర్ ఓ పాడ్ కాస్ట్‌లో చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

ఇది కూడా చూడండి: Asia Cup 2025: టీమిండియా విన్నింగ్ మూమెంట్స్.. ట్రోఫీ లేకుండా విజయాన్ని ఎంజాయ్ చేసిన ఆటగాళ్లు.. ఫొటోలు చూశారా?

ఇది కూడా చూడండి: Women's Cricket World Cup 2025: నేటి నుంచే మహిళల క్రికెట్ ప్రపంచ కప్.. టీమిండియా ఫైనల్ జట్టు ఇదే!

గెలిచిన జట్టుకు డబ్బు ఇవ్వలేదని..

పాకిస్తాన్ జట్టు 2009లో T20 ప్రపంచ కప్ గెలిచింది. అయితే గెలిచిన జట్టుకు 2.5 మిలియన్ రూపాయలు ఇస్తానని అప్పటి ప్రధాని యూసుఫ్ రజా గిలానీ హామీ ఇచ్చారని.. కానీ ఆ డబ్బు ఎప్పుడూ చెల్లించలేదని సయీద్ అజ్మల్ పేర్కొన్నారు. ప్రభుత్వ చెక్ బౌన్స్ అయ్యిందని, ఇలా జరుగుతుందని అప్పుడే నాకు తెలిసిందని అన్నారు. అయితే దీన్ని పీసీబీ చీఫ్ నిర్వహిస్తారని తెలిపారు. కానీ ఆ చెక్‌ను మళ్లీ ఇవ్వడానికి అతను ఒప్పుకోలేదన్నారు. ప్రపంచ కప్ గెలిచినప్పుడు కేవలం ఐసీసీ నుంచి మాత్రమే వారు డబ్బు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో అతను బీసీసీఐపై ప్రశంసంలు కురిపించారు. బీసీసీఐ కానీ, భారత ప్రభుత్వం ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనలకు రివార్డులు ఇవ్వడానికి ఎప్పుడు ముందు ఉండేదని అన్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడంలో ముందుండే పాక్ ప్రభుత్వ పెద్దల చిల్లర చేష్టలకు ఇది నిదర్శనమని నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు