దవడ పగిలిపోవడంతో.. మైదానంలోనే కుప్పకూలిన క్రికెటర్
న్యూజిలాండ్ పాకిస్థాన్ చివరి వన్డే సిరీస్లో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా ఇమామ్ దవడకి గాయం కావడంతో నొప్పితో మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే వైద్య బృందం మైదానంలోకి చేరుకుని చికిత్స చేసింది.