/rtv/media/media_files/2025/04/24/IKWOJkQfQVJTWsNLyd8V.jpg)
pak-captain Rizwan
Mohammad Rizwan: పాకిస్తాన్ సూపర్ లీగ్(Pakistan Super League) మ్యాచ్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్(Islamabad United) ముల్తాన్ సుల్తాన్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యునైటెడ్ కేవలం 17.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. వికెట్ కీపర్-బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ అజేయంగా 80 పరుగులు చేశాడు.
Also Read: అందుకే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ .. అసలు మ్యాటర్ చెప్పిన కార్తిక్ సుబ్బారాజు
సోషల్ మీడియాలో వైరల్
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు గానూ 168 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ , ఉస్మాన్ ఖాన్ రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. రిజ్వాన్ 38 బంతుల్లో 36 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో సహనం కోల్పోయిన రిజ్వాన్ డగౌట్‌లోకి తిరిగి వెళ్లే క్రమంలో కోపంతో తన హెల్మెట్‌ను నేలకేసి విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉస్మాన్ ఖాన్ దూకుడుగా ఆడి 40 బంతుల్లో 61 పరుగులు చేశాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ (9), ఇఫ్తికార్ అహ్మద్ (10), క్రిస్ జోర్డాన్ (6) సహకారంతో జట్టు 168 పరుగులు చేసింది.
Also Read: Rajamouli: మహేష్ బాబు కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి.. వీడియో వైరల్
— urooj Jawed 🥀 (@cricketfan95989) April 24, 2025
ఇస్లామాబాద్ యునైటెడ్ బౌలర్లలో మెరెడిత్ (1/33), హోల్డర్ (1/25), షాదాబ్ (1/29) తరఫున రాణించారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్ ఆటగాళ్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ 13 బంతుల్లో 22 పరుగులు చేయగా.. గౌస్ (80), కోలిన్ మున్రో(45), మహ్మద్ నవాజ్ (21) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
Also Read: జీరో లైన్ దాటిన భారత జవాన్.. బంధించిన పాక్ ఆర్మీ!
Also Read: Duvvada Srinivas: థాంక్యూ జగన్.. సస్పెన్షన్ పై దువ్వాడ సంచలన వీడియో!