RRR తర్వాత భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ఊహించని ఫలితాన్ని అందించింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే మెగా అభిమానులతో సహా సినీ ప్రియులందరినీ తీవ్ర నిరాశపరిచింది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమా అవుట్ కమ్ పై కీలక విషయాలు వెల్లడించారు. అయితే కార్తీక్ సుబ్బరాజు గేమ్ ఛేంజర్ కి కథా రచయితగా వ్యవహరించారు.
#KarthikSubbaraj on #GameChanger Outcome:
— Gulte (@GulteOfficial) April 23, 2025
“I initially pitched a one-line story, which was about a grounded IAS officer to #Shankar sir. Later, it turned into a completely different world. Many writers got involved, and the story and screenplay were changed.” pic.twitter.com/8OUTtIHiSi
అందుకే ప్లాప్
'రెట్రో' ప్రమోషన్స్ లో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజు ఈ విషయం పై మాట్లాడారు. అయితే మొదట కార్తీక్ ఒక డీసెంట్ IAS ఆఫీసర్ కథను డైరెక్టర్ శంకర్ కు చెప్పారట. కానీ ఆ తర్వాత కథ పూర్తి భిన్నంగా మార్చబడింది. ఇందులో అనేక మంది రచయితలు పాల్గొన్నారు. కథ, స్క్రీన్ ప్లే మొత్తం మార్చబడ్డాయి అని వెల్లండించారు. ఇదిలా ఉంటే 'గేమ్ ఛేంజర్' విడుదలైన మరుసటి రోజు కార్తీక్ సుబ్బరాజు సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో 'పెద్ది' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి టైటిల్ గ్లిమ్ప్స్ విడుదల చేయగా సోషల్ మీడియాను షేక్ చేసింది. చరణ్ మాస్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందించాయి. దీంతో ఈసారి గ్లోబల్ స్టార్ హిట్టు కొట్టడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.
telugu-news | latest-news | cinema-news | game-changer | Ram Charan