BSF Jawan In Pakistan: జీరో లైన్ దాటిన భారత జవాన్.. బంధించిన పాక్ ఆర్మీ!

ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద BSF జవాన్ ను పాక్ సైన్యం బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను BSF ఖండించింది.

New Update
pak-army

pak-army

BSF Jawan In Pakistan: పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) మధ్య పంజాబ్ నుంచి బిగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.  ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద BSF జవాన్ ను పాక్ సైన్యం బంధించింది. 182వ బెటాలియన్‌కు చెందిన పికె సింగ్ అనే బిఎస్‌ఎఫ్ జవాన్ తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని పాక్ ఆర్మీ(PAK Army)  చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను BSF ఖండించింది. జవాను అనుకోకుండా జీరో లైన్ దాటాడని..  తప్పుడు ఆరోపణలతో జవాన్ ను  అదుపులోకి తీసుకుందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది.  

Also Read: అందుకే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ .. అసలు మ్యాటర్ చెప్పిన కార్తిక్ సుబ్బారాజు

రైతులు పంట కోస్తున్న ప్రదేశంలో ఆ సైనికుడు వారిని గమనిస్తున్నాడని తెలిపింది.. రెండు దేశాల సరిహద్దులు కలిసే సరిహద్దు భాగాన్ని జీరో లైన్ అంటారు. ఈ ప్రదేశంలో వ్యవసాయం చేయడానికి రైతులకు ప్రత్యేక అనుమతి లభిస్తుంది. రైతులు పంటలు కోసేటప్పుడు వారి భద్రత కోసం BSF సైనికులు వారితో ఉంటారు. వారిని రైతు రక్షకులు అని కూడా అంటారు.

Also Read: Rajamouli: మహేష్ బాబు కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి.. వీడియో వైరల్

ఆయుధం స్వాధీనం

జీరో లైన్ కు చాలా ముందుగానే ముళ్ల తీగను ఏర్పాటు చేస్తారు. జీరో లైన్ పై స్తంభాలను మాత్రమే ఏర్పాటు చేస్తారు. అక్కడ వేడి తీవ్రంగా ఉండటంతో సైనికుడు జీరో లైన్ దాటి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి ఒక చెట్టు నీడ కింద కూర్చున్నాడు.  ఇంతలో పాకిస్తానీ రేంజర్లు అతన్ని చూసి అదుపులోకి తీసుకుని వెంటనే అతని ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతని విడుదల కోసం రెండు దళాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమని, గతంలో ఇరువర్గాల మధ్య ఇలాంటివి జరిగాయని అధికారులు తెలిపారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. 

Also Read: జీరో లైన్ దాటిన భారత జవాన్.. బంధించిన పాక్ ఆర్మీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు