Ind Vs Pak: భారత ఆటగాళ్లకు దూరంగా ఉండండి.. పాక్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్!

భారత్, పాక్ క్రికెటర్ల మధ్య సంబంధాలపై పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. మైదానంలో అడుగుపెట్టిన తర్వాత ఇండియా ఆటగాళ్లతో పాక్ క్రికెటర్లు ఫ్రెండ్‌షిప్ చేయకూడదన్నారు. ఈ బలహీనత వల్లే మెగా టోర్నీలో భారత్‌పై పాక్ ఓడిపోతుందన్నారు.  

New Update
ind vs pak

Moin Khan shocking comments on Indian and Pakistani cricketers relationship

Ind Vs Pak: భారత్, పాకిస్థాన్ క్రికెటర్ల మధ్య సంబంధాలపై పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. టీమ్ ఇండియా ఆటగాళ్లతో పాక్ క్రికెటర్లు ఫ్రెండ్ షిప్ చేయకూడదని చెప్పడం ప్రపంచ క్రికెట్‌లో చర్చనీయాంశమైంది. మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా భారత్ -పాక్ జట్లు ఫిబ్రవరి 23న తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఛాంపియన్ ట్రోఫీ గురించి మాట్టాడిన మొయిన్‌ ఖాన్.. పాక్ టీమ్‌కు పలు గెలుపు సూత్రాలను సూచించారు. 

నాకు అలాంటి ఉద్దేశం లేదు..

ఈ మేరకు మొయిన్ మాట్లాడుతూ.. 'భారత్, ఇతర ప్రత్యర్థి ఆటగాళ్లను అగౌరవ పరచట్లేదు. నాకు అలాంటి ఉద్దేశం లేదు. కానీ బరిలోకి దిగిన తర్వాత ప్రత్యర్థి ఆటగాడితో స్నేహంగా ఉండటం సరైంది కాదు. ఈ బలహీనత వల్లే మెగా టోర్నీలో భారత్ పై పాక్ ఓడిపోతుంది. కాబట్టి ఈ ఛాంపియన్ ట్రోఫీలో భారత క్రికెటర్లతో స్నేహం చేయొద్దు. గ్రౌండ్ లో నువ్వా... నేనా అనే విధంగా పోటీ పడాలి. అప్పుడే గెలుపుపై పట్టుదల పెరుగుతుంది' అని పాక్ క్రికెటర్లను హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Maoist Hidma: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. హిడ్మా ఔట్!

బ్యాట్లను చెక్‌ చేస్తున్నారు..

అలాగే భారత ఆటగాళ్లు ఆడుతున్నపుడు పాక్ ప్లేయర్లు వారి బ్యాట్లను చెక్‌ చేస్తున్నారని అన్నారు. సరదాగా మాట్లాడుతుంటారు. వారు అలా ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావటం లేదన్నారు. ప్రత్యర్థి ప్లేయర్లను గౌరవించవద్దని తన అభిప్రాయం కాదని, భారత్‌తో బరిలోకి దిగినప్పుడు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని తనకు సీనియర్లు చెప్పినట్లు గుర్తు చేశారు. 

ఇది కూడా చదవండి: IND w Vs ENG w: అండర్-19 టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు భారత్.. ఇంగ్లండ్‌ చిత్తు చిత్తు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు