IND w Vs ENG w: అండర్-19 టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు భారత్.. ఇంగ్లండ్‌ చిత్తు చిత్తు!

అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌‌కు భారత్ దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండోసెమీస్‌లో 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ 113 పరుగులు చేయగా.. భారత్ 15 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ను కోల్పోయి 117 పరుగులు చేసింది.

New Update
team India reached u19 women's t20 world cup final

team India reached u19 women's t20 world cup final

U19 T20 Women World Cup

అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు దుమ్ము దులిపేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు కేవలం 113 రన్స్ మాత్రమే చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు కేవలం 15 ఓవర్లలోనే ఫినిష్ చేసేసింది. ఒక్క వికెట్‌ను కోల్పోయి 117 పరుగులు చేసి విజయ కేతనం ఎగురవేసింది. భారత ఓపెనర్లు కమలిని (56*), త్రిష (35) రన్స్ చేశారు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక క్రీజ్ లోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లకు భారత బౌలర్ల హడలెత్తించారు. స్టార్ బ్యాటర్ ఓపెనర్ అయిన జెమీమ గ్రీస్‌ను (9) పరుగులకే వెనక్కి పంపించారు. ఆమె వికెట్ తీసిన ఆయుషి శుక్లా (2/21)తో అదరగొట్టేసింది. ఆ తర్వాత సహచర బౌలర్లు కూడా చెలరేగిపోయారు. 

Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!

వైష్ణవి శర్మ (3/23), పరునిక సిసోదియా (3/21) బౌలింగ్‌లో దుమ్ముదులిపేశారు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ అబి నోర్‌గ్రోవ్‌ (30), డేవినా పెరిన్ (45), అము సురేన్‌ కుమార్ (14) తప్ప ఇంకెవరూ ఎక్కువ స్కోర్ చేయలేదు. దీంతో ఇంగ్లాండ్ 113 పరుగులకే పరిమితం అయింది.

Also Read :   ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్‌ రెబల్‌ స్టార్‌! 

Also Read :  ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?

ఈ పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మొదటి నుంచే ఫామ్ కనబరిచింది. ఆడుతూ పాడుతూ ఆ లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్లు అయిన కమలిని, త్రిష తమ అద్భుతమైన ఆట తీరుతో జట్టు విజయానికి పునాది వేశారు. అనంతరం త్రిష ఔటైనప్పటికీ సనికా చల్కే (11*) పరుగులతో కలిసి కమలికి తోడుగా నిలిచింది. దీంతో వీరు 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో ఈ ఆదివారం భారత్ తలపడనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు