/rtv/media/media_files/2025/01/31/NNOIm3FWTozxEEyCHuRm.jpg)
Maoist Madvi Hidma out from central committee
Maoist: మవోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ఎన్‌కౌంటర్లలో అగ్రనాయకులు నేలరాలుతున్న నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి మద్వీ హిడ్మాను తొలగించింది. అతని స్థానంలో మరొకరికి దండకారణ్యం బాధ్యతలు అప్పగించింది.
పార్టీ నాయకత్వంలో మార్పులు..
ఈ మేరకు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై వరుస దాడులు చేస్తోంది. వేల మంది సైన్యంతో మావోయిస్టు అడ్డా అయిన దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసి దొరికిన వారిని దొరికినట్లు కాల్చేస్తుంది. దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతుండగా పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాలని భావిస్తోంది. అలాగే కోవర్టులు కూడా పెరిగిపోవడంతో ఎవరిని నమ్మాలో తెలియక తలలు పట్టుకుంటున్న మావోయిస్టులు పలు కీల మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే అగ్రనేత హిడ్మాను సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Champions Trophy : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్
సుక్మా దాడి తర్వాత కీలక బాధ్యతలు..
ఇటీవల వరుస పరిణామాలతో హిడ్మాను తొలగించాలని నిర్ణయం తీసుకున్న మావోయిస్టు పార్టీ.. అతని స్థానంలో మరొకరికి దండకారణ్య బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. దండకారణ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న హిడ్మాను తప్పించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే హిడ్మాను తప్పించారా? లేక ఎన్ కౌంటర్లను అడ్డుకోవడంతో హిడ్మా ఫెయిల్ అయ్యారా? లేక పోలీసుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పార్టీ నాయకత్వంలో మార్పులు చేస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీని ప్రభావితం చేసిన కీలక వ్యక్తుల్లో హిడ్మా ఒకరు కాగా.. 2017 సుక్మా దాడి తర్వాత హిడ్మాకు కీలక బాధ్యతలు అప్పగించింది మావోయిస్టు పార్టీ.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: కుంభమేళాలలో తెలంగాణ వాసులు మిస్సింగ్.. ఆ నలుగురు ఎక్కడ?